Friday 9 November 2018

Kabhi Socha na tha !!

wohoo... hello..naa  blog mithrulu andariki na namaskaralu 🙏🙏 nenu gurthunnana.. appudeppudo 2013 lo chusi untaru..mellaga gurthu vastanu lendi :) Andaru ela unnaru?? Kushalamena 😃

 Finally.. inni rojula baddakam cum crazy life cum busy schedules madhyalo ippatiki nee vanka chuse adrusthtam kaliginde naa blog kutty :) Firstly, neeku sorry.. neeku ey feeds and posts lu tinipinchananduku. Ooo.. kummesthanu, iragadeesthanu ani appudeppudo January 2013 lo start chesa and asusual manishini kada.. na kaalu fracture set avvagane thurrumantu na urukula parugula life loki running race start chesesanu. Intlo kuduruga koorchunnanni rojulu boldu postlu raasesina nenu taruvatha nijamga nee kesi chudataniki kuda time lenantha busy ga life twist lu turn lu icchesindi. But, whatever said and done..malli inni rojulaki nuvvu baaga gurthocchav. Almost all 5 years taruvatha nee daggariki vacchesa :) Missed you so much !

Sare kaani.. ee 5 years lo boldanni changes na life lo.. avanni meetho share chesesukunta.. chaala gammatthuga gadichindandi na journey..Mee life lo kuda boldanni changes jarigi untai.. nenu follow ayye andaru blog mithrula post lu okkokkatiga chadavatam start chestanu :) I am really happy to be back !
Ika naa mucchatlaki vasthe ... meerandaru bagundi ani chadivina na katha "Anukokunda " ki drushyaroopam icchi Amma ki dedicate cheyyali ane thought ravadamtho start aina na Film making journey " Jallu" ane short film ayyindi :) Nenu act chesi Direct chesanu edo saradaga.. ikkadi varaku baagane undi...But...


 adi akkaditho aagaka nenu eppudu oohinchani, asalu kalalo kuda talachukoni vidham ga na life turning point ki reason ayyindi. Ade... Sunitha Upadrasta's "Raagam" 😊😍  Konni saarlu life takes us to a point where we never expect us to be. Alage one fine day my life took a big U Turn personally and creatively kooda. Ah U turn ki sakshyam " Raagam" !! Nenu katha raasukovatam oka etthu aithe daantlo act cheyyadaniki nenu anukunna casting inko etthu. Enduku antara?? Singer Sunitha garini nenu lead role ga anukovadame daaniki kaaranam. Assalu acting ante aamada dooram lo untaru avida.. Singing prapancham lo and dubbing prapancham lo oka star tanu. Almost more than 750 movies ki dubbing and inkenno vela melodious paatalu. Intha busy ga unde tanu, acting ante assalu ishtame leni Sunitha gari thone ee lead role cheyyinchali ani naa manasuki anipinchadame ne chesina pedda sahasam. Enno film offers vacchina sorry antu mruduvuga cheppesaru tanu. But ! destiny anedi okati untundi antaru.. na vishayamlo kuda ah destiny ey Sunitha garini oppukunela chesindi. And , I strongly believe everything happens for a reason.. nenu Sunitha garini kalavatam kuda alantide And I am glad that she accepted and lived the character  "Pravallika" which I wrote with lots of love. And deeniki pani chesina cast & crew and technicians andaru the best of the best asalu. Sunitha garu, Sameer, Sana garu & Sai Kiran Anna.Sunil Kashyap gaari music.. ila.. boledu.. Aunu...inthaki.. evaraina choosara ma "Raagam" ni ?? choosthe please do share your views :) I will be happy. Chaala mandiki teliyani boldanni sangathulu unnai in this journey.  Emo, ivanni.. ila ivvala blog lo raasthanani eppudu anukoledu.. but.. life is all about unexpected things again 😃



Chaithanya Sriperumbudur nunchi... Sree Chaitu ki jarigina transformation was not a easy one. oka 5 years back ee blog start chesinappudu naa prapanchamento nenento.. Life ante chala easy ga teesukune danni. Enno dreams unna .. just dreams ey kada elago avvavu anukuni I was happy in my own dream world. But.. now.. Life has taught me many things.. Now, I know that life is not about just living and being in dream world, but it is also about what all you could do to make your soul happy and make it a reality. Ah soul thing ippudippude experience chesthunna. Whatever I was passionate about, I have made it my passion now and I am taking small steps towards achieving it !!

And.. I want to stay connected to creative world by all means !! anduke ippude jaagrathhaga na blog dummu dulipanu 😛 will be sharing my thoughts and experiences as much as frequently I can !!


Jai !! Blogamma 😄

Sunday 11 August 2013

అనుకోకుండా..!!- చివరి భాగం

శ్రావ్య ! అమ్మ.. ఫోన్  అంటూ... తన ఫ్రెండ్ పెట్టిన కేక కు లేచి అదే నిద్ర మబ్బులో ఫోన్ దగ్గరకు వెళ్ళింది శ్రావ్య. ఆ... అమ్మ.. చెప్పు! ఏంటే ఇంకా లేవలేదా ? అటు నుంచి అడిగింది సుధా. లేదమ్మా! నిన్న రాత్రి లేట్ అయ్యింది. హ్మ్మ్.. చెప్పు .. ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావ్ ? అమ్ములూ!... నిన్ను చూసి గర్వపడాలో.. లేక ఇలా జరిగినందుకు భాధ పడాలో .. అర్థం కావడం లేదే.. అంటూ సుధా గొంతు బొంగురుపోవడంతో, శ్రావ్య కంగారుపడుతూ అడిగింది .. ఏమైంది? అమ్మ?... చెప్పాక.. నువ్వు నా మీద అలగనూ , కోపం తెచ్చుకోను అంటేనే చెపుతాను.అబ్బా  ... పొద్దు పొద్దున్నే ఈ సస్పెన్స్ థ్రిల్లర్.. ఏంటమ్మా  నాకు.. చెప్పు.. ఏమి అనను. ఏమి లేదు అమ్ములూ.. పోయిన నెల నీకు ఒక మంచి సంభంధం వచ్చింది.. అబ్బాయి వాళ్ళకి నువ్వు బాగా నచ్చావ్ .. అమ్మా!.. మళ్ళి మొదలు పెట్టావా నీ పెళ్లి గోల ?అదిగో.. ఏమి అనను అన్నావ్ ! కాసేపు నేను చెప్పేది విను అమ్ములూ.. నీకు ఆ అబ్బాయి నచ్చి ఉంటే వచ్చే నెల లో పెళ్లి అనుకున్నారు... కాని నీకు నచ్చలేదు కదా..  ఏం చేస్తాం లే .. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. .  శ్రావ్య కి ఏమి అర్థం కావటం లేదు మైండ్ అంత బ్లాంక్ గా ఉంది ... మెల్లగా అడిగింది..నేను ఎప్పుడు చూసానమ్మ? అసలు అబ్బాయి పేరు ఏంటి?  రి. షి . కు. మా. ర్....!

 అంతే.. శ్రావ్య కి తన పక్క ల్యాండ్ మైనర్ పడినట్టు అనిపించింది! రిషి.. ఎవరో కాదు మేము చూసిన సంభంధమే. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావ్. especially రిషి కి . నీ గురించి .. పెళ్లి మీద నీకు ఉన్న ఒపీనియన్ గురించి తెలిసి , రిషి నే అన్నాడు ..  నా లాగానే ఆలోచించే అమ్మాయి దొరకడం నా లక్... నేను శ్రావ్య తో ఒక స్ట్రేంజర్ లాగా  ఇంట్రడ్యూస్ అవుతాను .. తనకు నా మీద ప్రేమ  కలిగించటానికి  ట్రై చేస్తాను.. ఒక వేళ శ్రావ్య కి నేను నచ్చక పోతే నా బ్యాడ్  లక్ అనుకుంటాను ఆంటీ! .. అని అన్నాడు. నీకు ఇదంతా చెప్పొద్దూ అని ప్రామిస్ వేయించు కున్నాడు.

సుధా ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉంది. శ్రావ్య  అదేమీ పట్టించుకోకుండా సుధా ని అడిగింది.. అమ్మా.. నాకు రిషి ఫోన్ నెంబర్ కావాలి !


ఆ రోజు " ఐ లవ్ APSRTC " అని రాసిన తరువాత.. దాని తరువాత ఇలా రాసుకుంది శ్రావ్య తన డైరీ లో ... ఇవ్వాళ రిషి నన్ను కార్ లో డ్రాప్ చేస్తాను అని అనగానే ఎగిరి గంతేసి వెళ్లి కూర్చోవాలి అనిపించిది.. అందులోను వర్షం! వావ్.. సో రొమాంటిక్ :) ఎందుకో తెలియదు వీడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు.అంత దగ్గరగా ఉంటే.. వాడి కళ్ళలోకి చూస్తే.. "ఐ లవ్ యు " అని నేనే చెప్పేదాన్నేమో!.. అమ్మో.. ఇంకేమైనా ఉందా...టైం కి బస్సు వచ్చి బ్రతికిపోయా. అందుకే.. " ఐ లవ్ APSRTC "!

శ్రావ్య కి ఇదంతా ఏదో మాయ లాగ ఉంది. రిషి మాటల్లో నిజాయితి నో , లేక ప్రేమ మాయో తెలియదు కానీ.. ఎప్పటి నుంచో తనలో రిషి మీద దాచుకున్న ప్రేమ అంతా ఒక్కసారిగా పెల్లుబికింది. అప్రయత్నం గా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.



 నిన్న  సాయంత్రం ఆఫీసు దగ్గర తన కోసం ఎదురు చూస్తున్నాడు అని తెలిసి కూడా.. అమ్మ కి నాన్న కి తన మీద ఉన్న నమ్మకం ని చెడగొట్టటం ఇష్టం లేక, కొద్ది రోజుల్లోనే కలిగిన ఈ ప్రేమ నిజమైనదో లేక ఉత్తి అట్రాక్షన్ నో  తెలియక.. ఎంతో కష్టం గా అనిపించినా ని  రిషి ని  ఇగ్నోర్ చేసి వచ్చేసింది. కాని ఇప్పుడు అమ్మ చెప్పింది విన్నాకా.. ఒక అమ్మాయి ఆలోచనలకు వేల్యూ ఇచ్చే గొప్ప మనసు ఉన్న రిషి మీద ఇష్టం ఇంకా ఎక్కువ అయ్యింది... అరేయ్.. రిషి గా ..నువ్ అయ్యిపోయావ్ అంతే !.. యు  స్వీట్ స్టుపిడ్ :) అని  మనసులో చిలిపి గా అనుకుంటూ.. రిషి దగ్గరకు బయలుదేరింది శ్రావ్య.

శ్రావ్య తన ప్రేమ ని ఒప్పుకోలేదు అనే భాధలో  ఇంకో నెల రోజులు లీవ్ ఉన్నా.. రిషి U.S కి తిరిగి వెల్లిపోదాం అని డిసైడ్ అయ్యాడు. ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుండగా ఫోన్ వచ్చింది.. శ్రావ్య కి ఆక్సిడెంట్ అయ్యింది ... జూబిలీ హిల్స్ లో అపోలో హాస్పిటల్ కి అర్జెంటు గా రావాలి  అనీ.. !రిషి కి గొంతు జారి గుండె లోకి వచ్చింది. హడావిడిగా ఎయిర్ పోర్ట్ లో నుంచి బయటకి వస్తుంటే అప్పుడు కనిపించింది శ్రావ్య.. నవ్వుతూ... చిలిపి గా తననే చూస్తూ.. చేతిలో ఒక చిన్న కార్డు బోర్డు పట్టుకుని నిలుచుంది.. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది... "To the hero of my heart… “Rishi”…I love you.. will you marry me ??” అని..

 ప్రేమ , భయం , సంతోషం , భాధ.. ఇవన్ని కలిపి మిక్సీ లో గ్రైండ్  చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది రిషి పరిస్థితి. ఆక్సిడెంట్ అని అబద్దం చెప్పి  ఇంత కంగారు పెట్టినందుకు గట గటా తిట్టేసి ఎయిర్ పోర్ట్ లో కి వెళ్ళబోతున్న రిషి ని చూసి గట్టిగా అరిచింది శ్రావ్య.... ఓయ్!.. ఎక్కడికి వెళ్ళుతున్నావ్ ? ఇప్పటి దాక ఓ.. గడ గడా మాట్లాడావ్.ఏంటి ? నిన్న మా ఆఫీసు దగ్గర చెప్పినవన్నీ డయలాగ్స్ ఏనా?లేక నిజమా ? రిషి కి ఒక్కసారి గా ఉక్రోషం వచ్చింది.. ఔను.. నా ఫీలింగ్స్ నీకు dialouges .. థాంక్స్ .. ఈ అమ్మాయిలు అంతా ఇంతే.. స్టోన్ హార్ట్టెడ్! అంటున్న రిషి మాటలు ఒక్క సారిగా ఆగిపోయాయి. మాటలు రాక కాదు..." సారీ.. రా.. లవ్ యు " అంటూ శ్రావ్య పెదవులు తన పెదవులపై వేసిన ముద్ర కి :) అప్పటికే సన్నగా పడుతున్న చినుకులు ఆగి పెద్ద వర్షం మొదలయ్యింది, ప్రేమ కి వర్షానికి ఏదో అవినాభావ సంభంధం ఉన్నట్టు;-) అందరు సడన్ గా మొదలయ్యిన జడి వాన లో తడుస్తుంటే.. ఇక్కడ వీళ్ళు  ఇద్దరు మాత్రం వర్షం తో పాటు ముద్దుల జడివాన లో తడిసిపోయారు :)




XXXXXXXXXXXXXXXXXXXXXXXX కట్ చేస్తే XXXXXXXXXXXXXXXXXXXXXXXXX :-)

కృష్ణ వంశీ సినిమా లో పెళ్లి ఎంత కన్నుల పండుగలా ఉంటుందో ... అంతే కన్నుల పండుగ గా  రంగరంగ వైభవం గా జరిగింది శ్రావ్య , రిషి ల పెళ్లి.


మొదటి రాత్రి .. అప్సరస లా తన ముందు కు వచ్చిన శ్రావ్య ని అలాగే చూస్తూ ఉంది పోయాడు రిషి . నాకు ఏంటో ఇదంతా  ఇంకా కల లాగానే అనిపిస్తుంది బంగారం! ఒక నెల రోజుల్లో ఇద్దరి లైఫ్ లో ఎన్ని ట్విస్టు లు టర్నులు అని అంటున్న రిషి తో.. ఔనా.. ఐతే ఆగు.. అని గట్టిగా చెయ్యి మీద గిల్లి .. ఇప్పుడు ఇది నిజమే చూడు.. అంటూ చిలిపిగా నవ్వింది శ్రావ్య ! :)


                      **************************శుభం**************************



                                                      కథ కంచికి మనం ఇంటికి ;-) :-)

Thursday 25 July 2013

అనుకోకుండా...!! 2వ భాగం

అబ్బాయిలకి యుక్త వయసు వచ్చిందంటే ఏ విషయం లో క్లారిటీ లేకున్నా ఒక్క విషయం లో మాత్రం పిచ్చి క్లారిటీ ఉంటుంది. అదే .... వాళ్ళు ప్రేమించే అమ్మాయి గురించి... అది ముదిరాక ఆమెతో పెళ్లి గురించి :-) రిషి పరిస్థితి ఆ మొదటి స్టేజి దాటి రెండో స్టేజి లో ఉంది. "పెళ్ళాం"  అంటే శ్రావ్య లా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాడు.
ఎలాగో అయ్యాడు కాబట్టి , నెక్స్ట్ స్టెప్ తన ప్రేమ సంగతి చెప్పెయ్యాలి. కానీ...?? తనకంటే లవ్" అట్ ఫస్ట్ సైట్ " లాగా హార్ట్ లో బెల్స్ రింగ్ అయ్యాయి...  అలాగే  శ్రావ్య కి కూడా  రింగ్ అవ్వాలని లేదు కదా! అదీ కాక ఇందాకే చూసిన  అమ్మాయితో " ఐ లవ్ యు " అంటే మొదటికే మోసం వస్తుందని, మొదలు ఆమెతో పరిచయం పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అప్పటి నుంచి రిషి ఏదో ఒక వంక తో శ్రావ్య పని చేసే మ్యూజిక్ స్టోర్స్ కి వెళ్ళడం,తనతో కొంచం సేపు మాట్లాడటం, ఏదో ఒక సి. డీ కొనుక్కొని  రావడం పరిపాటి అయ్యింది.ఇలా ఫ్రీక్వెంట్ గా రిషి రావడం పై అక్కడ పని చేసే సేల్స్ గర్ల్స్ అందరిలో ఒక పెద్ద హాట్  టాపిక్ అయ్యిపోయింది.కొందరు సంగీతం పిచ్చోడు అనుకున్నారు, కొందరు డబ్బులు ఎలా కర్చుపెట్టలో తెలియక ఏవేవో సీ. డీ లు కొంటున్నాడు అనుకున్నారు.. ఇంకొందరు మాత్రం...  ఏదైతే ఏంటి కుర్రాడు హీరో లా ఉన్నాడు కొంచెం సేపు లైటింగ్ కొట్టుకోవచ్చు లే అనుకున్నారు :-) ఎందుకంటే ఒక అమ్మాయి ఇష్టపడటానికి ఏవైతే   క్వాలిటీస్  ఉండాలో అందులో దాదాపు వాటిల్లో  రిషి కి  ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అందగాడు, ఆజానుబాహుడు, జోవియల్ , ఫ్రెండ్లీ, వీటన్నిటికి కొస మెరుపులా మాంచి స్మైలింగ్ ఫేసు.
అన్నీ బాగానే ఉన్నాయి కాని ఎందుకనో శ్రావ్య మాత్రం రిషి ని  అంతగా పట్టించుకోవటం లేదు. అదే  రిషి కి ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్??? "ఎన్ని చూపులు తన   వైపు చూసినా.... నా చెలియ  చూపు కి మాత్రం  నోచుకోక పోతినే ...  ఏమి నా దౌర్భాగము" ! అంటూ కవిత్వాలు కూడా రాసేసుకున్నాడు!



శ్రావ్య ఆఫీసు అయిపోయింది. తన హాస్టల్ కి వెళ్ళడానికి  బస్సు స్టాప్  కి చేరి వెయిట్ చేస్తోంది. అదేంటో? సడన్ గా నిన్నటి దాక మండిన సూరీడు ఇవ్వాళా చల్లబడి పోయాడు. దానికి తగినట్టు మబ్బులు కమ్ముకున్నాయి. ఈ బస్సు ఏమో ఎంతటికీ రాదాయే! ఇప్పుడు ఈ బస్సు కోసం ఎవడు వెయిట్ చేస్తాడులే! అనుకుని ఆటో కోసం వెళ్లబోయే అంతలో, ఉరుములు మెరుపులతో వర్షం మొదలు అయ్యింది. దానితో మల్లి బస్సు స్టాప్ వైపు పరుగులు తీసింది శ్రావ్య. ఇంతలో ఎవరో పిలిచినట్టు వినిపించి వెనక్కు తిరిగింది. ఎవరా? అని చూస్తే కార్ లో రిషి. శ్రావ్య గారు తొందరగా రండి నేను డ్రాప్ చేస్తాను. నేను మీ హాస్టల్ వైపే వెళుతున్నాను. వద్దు.. రిషి గారు, నేను వెళ్ళిపోతాను మీరు వెళ్ళండి. అబ్బా.. పర్లేదండి నా కారు ఏమి అరిగిపోదు మీరు కూర్చుంటే అంటూ నవ్వాడు. అమ్మో! మా హాస్టల్ లో ఎవరైనా ఇలా నేను కారు లో దిగడం చూసారు అంటే గోవిందో.. గోవిందా ! నా ఫ్రెండ్స్ నన్ను క్వశ్చన్ లతోనే చంపేస్తారు. సారీ.. ఏమి అనుకోవద్దు ప్లీజ్ మీరు వెళ్ళండి... లిఫ్ట్ ఆఫర్ చేసినందుకు థాంక్స్!

 ఇందాకటి నుంచి వీళ్ళ మాటలని వింటున్న బస్సు స్టాప్ లోని జనాలు ఇద్దరినీ ఎగా దిగా చూడటం తో రిషి ఇక ఏమి అనలేక.... ఎలా ఒప్పించాలి చెప్మా??..." నాయనా రవి తేజ... నీ  సినిమాలలో ఐతే ఇట్టే పడిపోతారు హీరోయిన్ లు"  అని అనుకునే లోపు ..... లవ్ స్టొరీ లో విలన్ లా బస్సు రానే వచ్చేసింది. శ్రావ్య బస్సు ఎక్కేసి వెళ్ళిపోయింది" బై " చెప్పడం రిషి వంతు అయ్యింది. హాస్టల్ కి వెళ్ళగానే శ్రావ్య తన డైరీ లో రాసుకుంది " ఐ లవ్ APSRTC " అని !



రిషి కి చాల భాద గా ఉంది. "మనం ప్రేమించిన వాళ్ళు మన ప్రేమని అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ"... తన ప్రేమని శ్రావ్య అర్థం చేసుకోలేక పోతుందని హీరో గారి ఆవేదన. కాని ఎందుకో ఆ ఆవేదన లో కూడా రిషి కి శ్రావ్య మీద ప్రేమ ఎక్కువ అవుతుందే కాని తక్కువ మాత్రం అవ్వడం లేదు... ప్రేమంటే ఇదేనేమో? అనుకున్నాడు. ఎన్ని సినిమాలు చూడలేదు especially మణిరత్నం సినిమాలు... ప్రేమలో పడ్డ వాళ్ళకి , పడాలి అనుకునే వాళ్ళకి ఆయన తీసిన "గీతాంజలి ", " సఖి ", "బొంబాయి" గైడ్స్ లాంటివి.దానికి తోడు ఇళయరాజా, రెహమాన్ సంగీతం ప్రేక్షకులని ఎక్కడికో....... తీసుకెళ్ళి పోతుంది. ఇక ప్రేమికుల సంగతి అయితే అల్లాహ్ హీ జానే! :-) అంటే ఇప్పుడు మణిరత్నం సినిమాలు మన టాపిక్ కాదు .. ఆ సినిమాలలో హీరో లు తమ ప్రేయసి కై పడే ఆవేదన same టు same  రిషి పడుతున్నాడు అని చెప్పడానికి.. మీకు ఆ ఎఫెక్ట్ తెప్పించడానికి మాత్రమే ఇలా ప్రస్తావించాను :-)

ఇంకో నెల రోజుల్లో రిషి US కి వెళ్లిపోవాలి. శ్రావ్య కలవక పోయి ఉంటే తనకు ఈ పరిస్థితి లో పెద్దగా ఏమి అనిపించక పోయేది. ఎంత వద్దు.. అన్నా.. రెప్ప వెయ్యకుండా చూడాలి అనిపించే అందమైన మోము, చిన్న పిల్ల లాంటి స్వచ్చమైన చిరునవ్వు, కల్మషం లేకుండా అందరితో కలిసిపోయే తత్త్వం.. అన్నిటికి మించి ఆమె కి ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్... మాగ్నెట్ లా రిషి ని శ్రావ్య కి attract చేస్తున్నాయి . ఇక ఈ విరహము నేను ఓపలేను ! అనుకుని... ఎలాగైనా శ్రావ్య కి తన ప్రేమ విషయం చెప్పేద్దాము  అని ఫిక్స్ అయ్యాడు.

ఎప్పుడు వెళ్ళినట్టే మ్యూజిక్ స్టోర్స్ కి వెళ్ళాడు.. శ్రావ్య చాల సీరియస్ గా వర్క్ లో మునిగిపోయి ఉంది . హలో ! గుడ్ మార్నింగ్ ... శ్రావ్య గారు.. ఓహ్ ! రిషి గారు మీరా ? ఎంటండి.. ఇంత పొద్దున్నే సంగీతం మిమ్మలిని పిలిచిందా ? అని నవ్వింది. లేదండి.. మీరే నన్ను రప్పించుకున్నారు ! ఒక్క సారి ఆ మాట వినే సరికి శ్రావ్య కి ఏమి అనాలో అర్థం కాలేదు. రిషి మాత్రం తన వైపే సూటిగా చూస్తూ ఉండటం తో ఏమి వినిపించనట్టు అక్కడి నుంచి వెళ్ళబోయింది , శ్రావ్య గారు ! ఆగండి. నేను మీ కోసమే వచ్చాను. మీతో మాట్లాడాలి. మీ వర్క్ ని ఏమి డిస్టర్బ్ చెయ్యను, ఇవ్వాళా.. మీ ఆఫీసు ఐపోయాక మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు రాలేదు అంటే ఇంకెప్పుడు మీకు కనిపించను! అని చెప్పేసి విస విస వెళ్ళిపోయాడు రిషి .

శ్రావ్య ఈ ఊహించని పరిస్థితి కి హతసురాలు అయ్యింది . చేస్తున్న పని బుర్ర కి ఎక్కడం లేదు. సాయంత్రం ఎలా అయ్యిందో కూడా తెలియలేదు. తనకి చాల టెన్షన్ గా ఉంది .బుర్ర లో ఎన్నో ఆలోచనలు . సాయంత్రం ఏమి చెప్తాడు ? కొంపదీసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడా?   ప్రేమ.. అంటేనే నమ్మకం లేదు.. అందులోను రిషి గురించి తనకి పెద్దగా ఏమి తెలీదు.. ఏదో కొద్ది రోజుల పరిచయం. అమ్మ, నాన్న తన మీద ఎంతో నమ్మకం తో ఒక్కదాన్ని హాస్టల్ లో జాబు కోసం ఉంటాను అనగానే ఏదో సాధిస్తాను అనుకుని ఉంచారు. ఇప్పుడు ఈ నమ్మకాన్ని తను బ్రేక్ చెయ్యలేదు.. సో.. సాయంత్రం 6.30 కే ఆఫీసు లో తన పని అయిపోయినా శ్రావ్య ఆఫీసు నుంచి వెళ్ళలేదు. అయ్యాక ఆఫీసు బయటకి వచ్చి చూసింది. రిషి ఎక్కడ కనబడలేదు. వాచ్ చూసుకుంది 7.30 అయ్యింది .. చాల లేట్ అయ్యింది. తొందరగా హాస్టల్ కి వెళ్ళాలి అని .. బస్సు స్టాప్ వైపు అడుగులు వేస్తుంటే సన్నగా చినుకులు మొదలు అయ్యాయి. ఉరుకు లాంటి నడక తో వెళుతున్న శ్రావ్య తల మీద ఎవరో గొడుగు పట్టినట్టు అనిపించి పక్కకు చూస్తే... రిషి.



 ఎంతో... ప్రేమ నిండిన కళ్ళ తో తన వైపే చూస్తున్నాడు. ఆ చూపులో శ్రావ్య కి రిషి ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పలేక పోయాడో అది చెప్పకుండానే కనిపించింది. అయినా చాల మొండిగా గొడుగు నుంచి పక్కకు తప్పుకుంటూ... ఏంటి? మీరు ఇంకా ఉన్నారా ? ఆఫీసు ఐపోయాక రాక పోతే ఇంకెప్పుడు కనపడను అన్నారు ? అదీ కాక మీరు నాతో పర్సనల్ గా మాట్లాడేది ఏముంటుంది చెప్పండి? రిషి ఏమి మాట్లాడలేదు. సైలెంట్ గా మళ్ళి గొడుగు శ్రావ్య వైపు పడుతూ.. వర్షానికి ప్రేమకి ఏమి లింక్ ఉందో  తెలియదు కాని.. నాకు మాత్రం నీతో ఇలా వర్షం లో ఒకే గొడుగు కింద నడవడం  ... చాలా మెమోరెబుల్ శ్రావ్య !.. 6.30 వరకు నీ కోసం ఆఫీసు బయట ఎదురు చూసి నువ్వు రాక పోయే సరికి ఇంకెప్పుడు నీకు కనపడ కూడదు అని అనుకున్నాను. కాని 6.31 కి నువ్వంటే నాకు ఏంటో.. అర్థం అయ్యింది. నువ్వు లేని  ఆ ఒక్క నిమిషం కూడా నాకు ఒక యుగం లా తోచింది, ఈ ఒక్క గంట  నాకు ఒక జీవితం లా అనిపించింది. నాకు మంచి కుటుంబం, మంచి ఉద్యోగం, నా కోసం ప్రాణం ఇచ్చే  ఫ్రెండ్స్..అన్ని.. ఇవన్ని ఉన్నాయి... ఒక్క" నువ్వు" తప్ప !  నా  లైఫ్ లో ఎన్ని ఉన్నా అందులో నువ్వు లేకపోతే ఇవన్ని వేస్ట్ ! అందుకే ఇది నీకు చెప్పకుండా వెళ్ళలేక పోయాను   .... " ఐ లవ్ యు"  శ్రావ్య ! అని శ్రావ్య వైపు తిరిగాడు. అక్కడ శ్రావ్య లేదు. వె. ళ్ళి . పో . యి . o . ది !! చెప్పకుండా వచ్చిన వర్షం లాగా!

 తనను, తన ప్రేమ ను కాదని, చాలా సింపుల్ గా సైలెంట్ గా వె. ళ్ళి . పో . యి . o . ది!  రిషి కళ్ళలో నీళ్ళు  తిరిగాయి.. తన కింద నేల కుంగిపోతున్నట్టు అనిపించింది.. గమ్యం తప్పిన బాటసారి లా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.




******రిషి ప్రయాణం ఎక్కడికో ??? రిషి ని కాదని వెళిపోయిన శ్రావ్య జీవితం ఏ మలుపు తిరుగుతుందో... ??

                                        ******     ముగింపు వచ్చే వారం! ******    



Wednesday 17 July 2013

అనుకోకుండా...!!

అబ్బా! ఏంటమ్మా.... పెళ్లి.. పెళ్లి ... అని చంపుతావ్ ? ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటున్నారు  ఇంత తొందరగా ? అండ్ moreover... ఈ పెళ్లి..  గిళ్ళి మీద నాకు నమ్మకం లేదమ్మా.. హు ! టక్.. మని ఫోన్ పెట్టేసింది "శ్రావ్య".

ఏమి .. పిల్లో ఏంటో! ఒక్క మాట చెప్పితే వినదు .. అంతా నువ్వు చేసిన గారభమే " శేఖర్ " ! అంటూ చిర్రుబుర్రు లాడుతూ వంటింట్లో కి హడావిడి గా  వెళ్లి పోయింది" సుధా  ".

శ్రావ్య .. శేఖర్ , సుధా లకు ఒక్క గానొక్క ముద్దుల కూతురు . మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఉద్యోగస్తులు. పుట్టక పుట్టక  వాళ్ళ పెళ్లి అయ్యిన చాల సంవత్సరాలకి పుట్టింది శ్రావ్య . అందుకే శ్రావ్య  ఆడింది ఆట పాడింది పాటా అయిపోయింది . "చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం " అని అన్నట్టు ... చాల సాఫీ గా సాగిపోతున్నాయి వాళ్ళ జీవితాలు .



ఇంట్లో ఏ  డెసిషన్ తీసుకోవాలి అన్నా .. ముగ్గురి సమ్మతం ఉంటేనే ఇంట్లో బిల్ పాస్ అవుతుంది :) చిన్నప్పటి నుంచి శ్రావ్య చాల చురుకైన పిల్ల అవ్వడం వల్ల అటు చదువుల్లోను .. ఇటు extra curricular activities లోను టాప్ . శేఖర్ , సుధలు ఎప్పుడైనా కస్సు బస్సు లాడుకుంటే తనే పెద్ద ఆరిందలా ... "అరుంధతి" లో బుల్లి జేజమ్మ లెవెల్ లో తీర్పులు చెప్పి ఇద్దరినీ కలిపేస్తుంది. ఎంతో బాధ్యత గా ఉండే శ్రావ్య అన్నా... తను తీసుకునే నిర్ణయాలు అన్నా ... బోల్డంత నమ్మకం ఇద్దరికీ .

శ్రావ్య హైదరాబాదు లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, జాబ్స్ కోసం అని అక్కడే హాస్టల్ లో ఉంటుంది తల్లి తండ్రులకి దూరంగా . బి.టెక్  పూర్తి అయిన అందరు గ్రాడ్యుయేట్స్  లాగానే ఒక పెద్ద  software కంపెనీ లో జాబ్ కొట్టెయ్యాలి అనేది తన aim. దాని కోసం ప్రయత్నం చేస్తూ.. ఇంటర్వూస్ కి అటెండ్ అవుతూ.. ఖాళి గా ఉండటం ఎందుకని చదువుతో సంభంధం లేక పోయిన ఎక్స్పీరియన్స్ కోసం అని " మ్యూజిక్ వరల్డ్ " లో "కస్టమర్ రిలేషన్స్ మేనేజర్" గా పని చేస్తుంది. ఈతరం ఆడపిల్ల అవ్వడం వల్ల individuality అండ్ independency కొంచం ఎక్కువే.

ఇప్పటి వరకు సూపర్ ఎక్స్ప్రెస్ లా సాగుతున్న వాళ్ళ లైఫ్ జర్నీ లో శ్రావ్య పెళ్లి ఒక పెద్ద సమస్య లా మారింది . బంధువుల ఇంట్లో ఏ పెళ్లి కి వెళ్ళినా మెరుపు లాంటి శ్రావ్య నే సెంటర్ అఫ్ అట్రాక్షన్... దానితో పెళ్లి సంభందాల తాకిడి కూడా ఎక్కువే అయ్యింది . కాని శ్రావ్య కి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్ల... అందులోను ... facebook లు twitter లు నడుస్తున్న కాలం లో పాత చింతకాయ పచ్చడి లా పెళ్లి చూపులు , అరేంజ్డ్ మ్యారేజ్ లు ... ఏంటి ? తొక్కా ! అనేది తన ఫీలింగ్ . అదే ఇప్పుడు సుధా , శేఖర్ లకి అగ్ని పరీక్షలా మారింది .


ఏంటో .. ఈ అమ్మ లు అందరు ఇంతే ... ఊ.. అంటే ఆ .. అంటే .. ఆ సంభంధం బాగుంది .. ఈ పిల్లాడు  U. S లో ఉన్నాడు , ఆ పిల్లాడు  మహేష్ బాబు లా ఉన్నాడు అంటూ..  answering మెషీన్ లా  నాన్ స్టాప్ గా చెపుతూనే ఉంటారు అనుకుంటూ....  ఆఫీసు కి చేరింది శ్రావ్య. ఇలా వచ్చిందో లేదో బాస్ దగ్గరి నుంచి ఫోన్ , ఆయన కేబిన్ కి రమ్మని. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ డెస్క్ మీద పడేసి బాస్ ని కలవడానికి వెళ్ళింది .

గుడ్ మార్నింగ్ శ్రావ్య ! మీతో అర్జెంటు గా  మాట్లాడాలి అందుకే రమ్మన్నాను. ప్లీజ్ సిట్ డౌన్ ! చాల రోజులు నుంచి గమనిస్తున్నాను మన మ్యూజిక్ స్టోర్స్ సేల్స్ చాలా తగ్గిపోతున్నాయి. దీని గురించి మీ ఇన్ పుట్స్  కావాలి. ఎలా చేస్తే మన సేల్స్ ఇంప్రూవ్ అవుతాయో చెప్పితే అది వెంటనే ఫాలో అవుదాం.  సర్ ! అన్ని మ్యూజిక్ స్టోర్స్ లా కాకుండా మనం ఒక కొత్త ట్రెండ్ ని ఎందుకు తీసుకు రాకూడదు? కస్టమర్ సర్వీస్ ని ఇంప్రూవ్ చేస్తే సేల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి అని నా నమ్మకం. ఇప్పటి నుంచి మన సేల్స్ బాయ్స్ , సేల్స్ గర్ల్స్ ని కస్టమర్స్ వచ్చినప్పుడు పర్సనల్ గా  అటెండ్ అయ్యేలా చూద్దాం. ఇదే కాకుండా కొన్ని exciting ఆఫర్స్ ని స్టార్ట్ చేద్దాం సర్ ! అంటూ .. చెప్పుతున్న శ్రావ్య వైపు మెచ్చుకోలు గా చూసాడు బాస్ . వెరీ గుడ్ శ్రావ్య! నాకు తెలుసు మీరు చెప్పినవన్నీ ఇంప్లెమెంట్   చేస్తే మనం  సక్సెస్ అవుతాం.  అప్పుడప్పుడు మీరు కూడా అన్ని  మానిటర్ చేస్తూ ఉండండి. అల్ ది బెస్ట్ ! బాస్ కేబిన్ లో నుంచి బయటపడి .. హమ్మయ్య ! అని గాలి పీల్చుకుని పనిలో నిమగ్నం అయింది శ్రావ్య .


ఈ భాగ్యనగరం లో లైఫ్ ప్రెషర్, వర్క్ ప్రెషర్ లని తట్టుకోవడానికి ఒక మంచి టైం పాస్ సంగీతం. ఎన్ని టెన్సన్స్ ఉన్నా.. రెహ్మాన్ సంగీతమో , ఇళయరాజా రాగమో వింటే చాలు చిరాకులు అన్ని హాం .. ఫట్టే ! చెలి కి దూరమైన ప్రియుడైనా , మొగుడ్స్ పైన అలిగిన పెళ్లామ్స్ అయినా , బాస్ చేతిలో తిట్లు తిన్న ఉద్యోగైనా, తొలి ప్రేమ లో చిక్కు కున్న ప్రేమికులైనా... ఎవరైతే ఏంటి ? ఎవరి మూడ్ కి తగ్గట్టు వాళ్ళకి ఒక టానిక్ లా పని చేసేది సంగీతమే అంటే అతిశయోక్తి  కాదేమో !

సాయంత్రం అయ్యింది . ఈ వేళ కస్టమర్స్ బానే ఉన్నారు . కస్టమర్స్ ని సరిగ్గా అటెండ్ అవుతున్నారో లేదో అని సేల్స్ బాయ్స్ ని గర్ల్స్ ని మానిటర్ చేస్తూ మధ్య మధ్యలో తను కూడా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది శ్రావ్య. ఇంతలో సేల్స్ గర్ల్ పద్మ ఒక కస్టమర్ దగ్గర క్వశ్చన్ మార్కు మొహం వేసుకుని నిలుచుని ఉండటం చూసి అక్కడికి వెళ్ళింది. ఏంటి ? పద్మా ? ఏమి అయ్యింది ? ఏమి లేదు మేడమ్, సార్ కి కొన్ని మంచి మ్యూజిక్ కలెక్షన్స్ కావాలంటా.. అదే ..ఏవి బాగుంటాయో చెప్పడం తెలియక ...?? అంటూ నసిగింది పద్మా. సరేలే, నేను చూసుకుంటాను.  నువ్వు వెళ్లి కొత్తగా వచ్చిన స్టాక్ ని ర్యాక్  లో సర్దు... సరే మేడమ్! అని  వెళ్లి పోయింది పద్మ.



చెప్పండి ... హౌ కాన్ ఐ హెల్ప్ యు ? అంటూ మృదు మనోహరం గా అడిగిన శ్రావ్య ని అలాగే చూస్తూ ఉండి  పోయాడు " రిషి ". ఒక్క సారి  చూస్తే మళ్ళీ  మళ్ళి  చూడాలి అని అనిపించే అందం శ్రావ్య ది. వడ్డు కు తగ్గ బరువు.. పేరుకు తగినట్టే శ్రావ్య మైన స్వరం..అన్నిటికి మించి ఆత్మ విశ్వాసం తో తొణికిసలాడే మోము. ఒకవేళ సినిమాల లో హీరోయిన్ గా ఎంటర్ అయితే " అనుష్క" కే గట్టి పోటి ఇచ్చేలా ఉంటుంది.


 రెప్ప వేయకుండా తన వైపే చూస్తున్న రిషి ని చూసి ... హలో .. సర్ ! మిమ్మలినే ... అంటూ పిలిస్తే కాని ఈ లోకం లోకి రాలేదు. ఓహ్ .. సారీ అండీ! ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను కొన్ని మంచి మ్యూజిక్ కలెక్షన్స్ కోసం వెతుకుతున్నాను. U.S లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన సాంగ్స్ వినడమే కాని అన్ని genres ఆఫ్ గుడ్ సాంగ్స్ వినడం కుదర లేదు తెలుగు లో ... నాకేమో మ్యూజిక్ అంటే ప్రాణం. సో ... మీరు నాకు కొంచం హెల్ప్ చేయగలరా ? ఓహ్.. ష్యూర్ అండి... మీకు ఎలాంటి మ్యూజిక్ అంటే ఇష్టం ? మెలోడీస్ , ఫాస్ట్ బీట్, కర్నాటిక్ ?? నాకు "మెలోడీస్ " అంటే చాలా ఇష్టం ..... బై ది వే మై నేమ్ ఈజ్ రిషి! అంటూ చెయ్యి ముందుకు చాచిన రిషి వైపు ఒక క్రీగంట చూసి.. శ్రావ్య.. హియర్ ! "కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ " అంటూ షేక్  హ్యాండ్ ఇచ్చి మనసులోనే అనుకుంది.. పర్లేదు హీరో హ్యాండ్ సమ్  గానే ఉన్నాడు. షేక్ హ్యాండ్ కూడా దొంగ షేక్ హ్యాండ్ కాదు . డీసెంట్ గానే ఉన్నాడు.. కాని U.S నుంచి వచ్చాడని  తెగ ఫోజు కొడుతున్నాడు.. తెలుగు పాటలు తెలిదంట హుహ్ ! అక్కడ రిషి కి మాత్రం గాల్లో తెలుతున్నట్టు అనిపించింది. situation కి తగ్గట్టూ...మ్యూజిక్ స్టోర్స్ స్పీకర్స్ లో నుంచి  " గాల్లో తేలినట్టుందే...  గుండె జారినట్టుందే" అని సాంగ్ వస్తుంది. తనలో తనే నవ్వుకున్నాడు. శ్రావ్య మాత్రం ఇదేమి పట్టనట్టు, మేలోడీస్ కలెక్షన్స్ కోసం తెగ వెతికేస్తుంది. ఒక పది నిమిషాల తరువాత  ఘంటసాల , A.R రెహ్మాన్,ఇళయరాజా , కీరవాణి కలెక్షన్స్ లో కొన్ని సీ. డీ లను సెలెక్ట్ చేసి ఇవి వినండి. హోప్ యు  విల్ లైక్ ఇట్ ! నాకు కూడా మేలోడీస్ అంటే ఇష్టం... సో .. నాకు తెలిసినంతలో సెలెక్ట్ చేశాను. నచ్చక పోతే మాత్రం నన్ను తిట్టుకోవద్దు అంటూ నవ్వుతూ చేతికి ఇచ్చింది . ఇచ్చినప్పుడు శ్రావ్య ముని వేళ్ళు సుతి మెత్తగా తాకి రిషి కి ఒక్క సారిగా కరెంటు షాక్ కొట్టినట్టు అయ్యింది. ఆ... ఆ.. ఆఆ... ఆఅఅ అహ్హ్హ్ ...! అని " మగధీర" లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపించినట్టు అయ్యింది కానీ ఛీ... ఎడిసావ్ ఎదవా ! మరీ అంత సినిమాటిక్ గా డ్రామా కింగ్ లా ఓవర్ ఆక్షన్ చెయ్యక .. నేను తట్టుకోలేను ! అని అంతరాత్మ అనటం తో ఉపసంహరించుకున్నాడు. శ్రావ్య ని వదిలి వెళ్ళాలని లేకున్నా సి . డీ ల కోసం వచ్చిన పని అయ్యిపోయింది ఇక వెళ్ళక తప్పదు కాబట్టి ... ఎంతో ఇబ్బంది గా బై చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుంచి మొదలు అయ్యింది రిషి లో లవ్ ఫీవర్ !




****** రిషి ఒక లవ్ సాంగ్ వేసుకుంటాడు ... ఈ లోపు మనం కొంచం బ్రేక్ తీసుకుందాం **** !! :-)
 ********************** TO BE CONTINUED ******************************































Friday 31 May 2013

ఆప్యాయతల కి దారేది ??

ఒక్కోసారి జనాలని .. ప్రపంచకాన్ని చూస్తుంటే భయం  వేస్తుంటుంది.దిన దినం ప్రవర్ధమానం చెందినట్టు మన భాష, జీవన  విధానం, మన పరిసరాలు , మనం వాడే టెక్నాలజీ నుంచి అన్నిటి లోను పరిణితి చెందిన మనం.. డెవలప్ అయ్యామా ? లేక ఇంకా రోజు రోజు కి అధో పాతాళానికి దిగాజారిపోతున్నామో ...  అర్థం కావటం లేదు! మన మధ్య దూరాలు తగ్గించడానికి కనుక్కున్నటెక్నాలజీ దూరాలు తగ్గిస్తుందా ? లేక ఇంకా దూరాలని పెంచుతుందా ? మీరేమంటారు ??


ఫేస్ బుక్ ,  ట్విట్టర్ లు  లో లేచిన దగ్గరి నుంచి ( కాదు..  కాదు దగ్గినా  తుమ్మినా  అంటే బాగుంటుందేమో:)) అప్ డేట్ ల మీద అప్ డేట్ లు ఇచ్చే మనం..  కమ్యూనికేషన్ లో "తోప్స్" అయ్యిన  మనం .... నిజం గానే భంధాలకి భాంధవ్యా లకి అప్ టూ  డేట్ గా ఉన్నామా ??



 నాకైతే ఉన్నా  కూడా లేము అనే అనిపిస్తుంది ... ఎందుకు ? అంటారా? ( ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మీకు కూడా నా లాగే అనిపిస్తుంది కచ్చితం గా.. ఇవ్వాల్టి జనరేషన్ కి తప్ప !) ఒకప్పుడు ఈ కేబుల్ టీవీ మోతలు,మొబైల్ ఫోన్ ల కూతలు, ఇంటర్నెట్ టెక్కులు ఇవేవి లేవు కనుక... అప్పుడు ఇంట్లో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే గొప్ప. (వీధి లో ఒకరు ఇద్దరికే ఉండేది. అవసరానికి వాళ్ళ నెంబర్ లని ఇచ్చుకునే వాళ్ళం. ఎవరి కన్నా ఫోన్ వస్తే వాళ్ళు వచ్చి పిలిస్తే అప్పుడు వెళ్లి మాట్లాడి వచ్చే వాళ్ళం ).టీవీ లో దూరదర్శన్ వస్తే సూపర్ !


 ఆఫీసు కి వెళ్ళిన అమ్మ నాన్న ల  కోసం పిల్లల ఎదురు చూపులు , మొగుడు ఆఫీసు కి వెళ్లి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా..  అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసే భార్యామణులు, స్కూల్ కి వెళ్ళిన పిల్లలు ఎప్పుడు తిరిగివస్తారా అని తల్లడిల్లే తల్లి మనసు .... ఇంట్లో ఎవరన్న బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు ఎదురుచూపులు ఉండేవి ఎందుకంటే ప్రతి సెకండ్ కి update ఇవ్వడానికి మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి  వచ్చే వరకు ఆత్రం ఉండేది ... కాదంటారా ? ఆఫీసు ల నుంచి స్కూల్ ల నుంచి వచ్చాక పిల్లలు పెద్దల కి బోల్డంత టైం. అప్పుడు  మనుషులకి మనుషులే వ్యాపకం. ఇప్పుడు మాటలు రాని  మెషీన్స్ ఏ  మనకు వ్యాపకం.. how silly ??

మహా అంటే బుధవారం చిత్రహార్,శుక్రవారం చిత్రలహరి ... ప్రతి రోజు రాత్రి 7 pm కి వార్తలు ...( అండ్ ఒకే ఒక్క న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ :)) అంతకు మించి టీవీ చూడాలి అనే అనిపించేది కాదు . సండే రోజు అందరు టీవీ ముందు కూర్చుని రామాయణం ,మహాభారతం చూసుకుంటూ టిఫిన్లు స్టార్ట్ చేస్తే ... జంగల్ బుక్ , మిక్కీ మౌస్ కార్టూన్స్ తో పిల్లల కి కాసేపు కాలక్షేపం. టీవీ కే  అత్తుకు పోవల్సినంత దౌర్భాగ్యం ఉండేది కాదు . మిగితా టైం అంతా ఫ్యామిలీ కే ఉండేది .  

కాని...  ఇప్పుడు బాబోయ్ ..... 24 ఘంటలు టీవీ ని వాయించుడే ..(దానికే కనుక నోరు ఉంటే పాపం మొత్తుకునేది !) పక్క న వాళ్ళతో కూడా మాట్లాడలేనంత బిజీ మనం... కాని "మొగలి రేకుల్లో" ఆర్కే కి ఎమన్నా అయితే అయ్యో పాపం అంటాం ..అదే కాక  ఆర్కే తన కొడుకు ని ఎప్పుడు కలుస్తాడో  అనే టెన్షన్ కూడా  ఎక్కువ మనకి... ( నేను సీరియల్స్ చూడను .. ఏదో ఈ సీరియల్ లో ఆర్కే అనే పేరు ఉందని ఒకటి రెండు సార్లు విన్నాను లెండి :)) సీరియల్ కూడా ఈ మధ్యనే అయ్యి పొయ్యింది అట !" మొగలి రేకులు" అయిపొతే ఏంటి ఇంకో...  "రోజా రేకులు" మొదలవుతుంది ... మంజుల నాయుడు కి కథలు తక్కువా... ;-) హి .. హి :)



ఇక మొగుళ్ళ గురించి డాడీ ల గురించి చెప్పే అవసరమే లేదు.  వాళ్ళకి .. టీవీ 9 , సాక్షి , T న్యూస్ ఉంటే చాలు ... జగన్ మీద , K.C.R , మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంట్లో పెళ్ళాం పిల్లల మీద కూడా ఉండదు ! ఇందంతా ఒక ఎత్తు అయితే కాలేజీ కి వచ్చిన పిల్లలు మన చేతికి తరువాత ... అసలు కళ్ళకి కూడా అందరు.. ! IPL  matches ...  Justin  Beiber, Shakira, Dub Step ల లోకం మునిగి తేలుతూ ...ఉంటారు . ( ఎందుకు ఉండరు ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఉంటే  కదా !) ఒకే ఇంట్లో ఉన్నా ... " ఎవరికీ వారే యమునా తీరే"! .. లాగా ఐపోయాయి బ్రతుకులు .


ఏవండి.. మీ అందరికో ప్రశ్న ... నిజ్జం గా చెప్పండి మీరు ఒక పోస్ట్ మాన్ ని చూసి ఎన్ని రోజులు అయ్యింది ? మీకు ఒక ఉత్తరం వచ్చి ఎన్ని ఏళ్ళు అయ్యింది ?? (ఏదో అమాసకో పున్నానికో  వెడ్డింగ్ కార్డ్స్ తప్ప ! ) ఆహా .. అసలు ఆ "ఉత్తరం " అనే పేరు వింటేనే ఎంత సంతోషంగా ఉండేదో ..


 పోస్ట్ మాన్  మన వీధి లోకి వస్తే చాలు మనకు ఎమన్నా ఉత్తరం ఉందో ..  లేదో ? అని బోల్డంత curiosity. దానికి తోడు ఆయన సైకిల్ నుండి కొట్టే బెల్ ... ఆ సౌండ్ వినగానే  ఇంట్లో ఏ పని లో ఉన్నా ....  ఇంటి ముందుకి వచ్చి వెయిట్ చేసేవాళ్ళం .  ఒక వేళ ఉత్తరం వచ్చిందంటే అది కూడా...  మన పేరు మీద  ... ఇక పండగే పండుగ :) ఎంతో  దూరం నుంచి మన కోసం రాసిన వాళ్ళ గురించి ఇక ఆలోచనలు షురూ ! ఉత్తరం మొత్తం చదివే సరికి నిజం గా వాళ్ళే  మన ముందు ఉన్న ఫీలింగ్. ఉత్తరాల లో ఉన్న పర్సనల్ టచ్ ఇప్పుడు మనం రాసుకునే ఇ మెయిల్ ల  లో ఉందా ?

ఏది ఏమైనా .. ప్రపంచం మారుతుంది .. టెక్నాలజీ ఫుల్లు గా అభివృద్ధి చెందుతుంది .. కాని ఒకప్పుడు ఉన్న ఆప్యాయతలు .. ప్రేమలు ... అభిమానాలు రోజు రోజు కి సన్నగిల్లుతున్నాయి. వీటి వల్లనే కమ్యూనికేషన్ గ్యాప్ . " కమ్యూనికేషన్ విచ్చలవిడి గా  ఉన్న ఈ రోజుల్లో అర్థం చేసుకోవడం కన్నా అపర్ధాలే ఎక్కువ  ఉన్నాయి" ... is this not funny ??? అలా అని మన డెవలప్మెంట్ ని నేను ఏమి తప్పుబట్టడం లేదు .   టెక్నాలజీ తో పాటు మనిషి మనిషి కి మధ్య ఉండే మానవత్వం, ప్రేమ,హ్యూమన్ రిలేషన్స్ ని కూడా ఫైన్ ట్యూన్ చేసి  సానబట్టాలి అంటాను.  అంతా  మన చేతుల్లో నే ఉంది ... ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటమో లేక ఎదిగిన కొద్ది కింద పడటమా .. అనేది ... ఆ దారి ఏంటో? మనకు మనమే కనుక్కోవాలి :) మరి మీ దారి ఏది ?

Wednesday 15 May 2013

సమ్మర్ హాలిడేస్ :-)

సమ్మర్ హాలిడేస్ .... వేసవి కాలం సెలవులు... అబ్బా....ఈ మాట వింటే చాలు చిన్నప్పుడు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసేది :) ఎందుకు రాదు మరి... అప్పటి వరకు సంవత్సరం పొడుగునా పొద్దు పొద్దున్నే ట్యూషన్స్ అని.. స్కూల్ అని.. ఎగ్జామ్స్ వస్తే నైట్ ఔట్స్ , కంబైన్డ్ స్టడీస్ అని ...నా లాగా  మాథ్స్ లో పొట్ట కోస్తే ఒక్క ఆల్జీబ్రా కూడా రాని వాళ్ళ సంగతైతే గోవిందో గోవిందా!  అచ్చ బాబోయ్... ఇన్ని టెన్సన్స్, కాంప్లికేషన్స్ మధ్య గడిచిన... ఉరుకుల పరుగుల జీవితానికి కాసేపు విశ్రాంతి... సమ్మర్ హాలిడేస్! ఆహా.. ఎవడు కనిపెట్టాడో కానీ ఈ సమ్మర్ హాలిడేస్ ని వాడికి పొద్దున్న, సాయంత్రం సాష్టాంగ నమస్కారాలు పెట్టెయ్యాలి అనిపించేది. ఫైనల్ ఎగ్జామ్స్ అపుడు మనం రాసే చివరి ఆఖరు ఎగ్జామ్ రోజున ఉంటుంది చూడండి ఆ... మజా... ఆహా...వర్ణనాతీతం... నేను అయితే ఆ ఇయర్ నోట్ బుక్స్ అన్ని పర పరా చింపేసి  చింపాంజీ డాన్సులు చేసేదాన్ని:) స్కూల్ బస్సు లోనే హడావిడి మొదలు అయ్యేది.. నా లాంటి తుంటరి పిల్లకాయలు  అంతాక్షరి లు , ఎగ్జామ్ రాసే ప్యాడ్  ని క్రికెట్ బ్యాట్  లా చేసి టెక్స్ట్ బుక్స్ లోని పేపర్స్ ని బాల్ లా చేసుకుని సచిన్ లెవెల్ లో క్రికెటు మ్యాచ్ లు ఆడుకుంటుంటే ... ఇంకో వైపు చదువే ప్రాణం.. చదువే లోకం... లా ఉండే మేధావి వర్గం పిల్లకాయలు అంతా... క్వశ్చన్ పేపర్స్ ని పట్టుకుని ఈ బిట్టు కి ఆన్సర్ ఏంటి? ఆ క్వశ్చన్ కి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి అని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు లు పెట్టేవాళ్ళు :) మొత్తానికి ఎలాగో ఈ ఇయరు చదువులు అయిపోయినై ..ఎంచక్కా... ఒక రెండు నెలలు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చెయ్యొచ్చు అనే ఆనందం ఒక పక్క ఉంటే , సమ్మర్ హాలిడేస్ తరువాత రిజల్ట్స్ ఏమి వస్తాయో అనే టెన్షన్ ఒక పక్క ఉండేది. ( అప్పుడు అర్థం కాలేదు  చిన్నప్పటి  నుంచే... సంతోషం ఉన్న దగ్గర దుఖం కూడా ఉంటుందనే జీవిత సత్యం మనకి మెల్లగా నరాలలోకి ఎక్కించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు  అని ) ఏదైతే ఏంటి  జో హోగా దేఖ జాయేగా! అనుకుని   ఫ్రెండ్స్ అందరికి బై బై లు టాటా లు హాలిడేస్ కి వెల్కమ్  చెప్పేసే దాన్ని :)


ఒక వారం రోజులు ఇంటి పట్టున ఉండి మిగితా నెల రోజులు ఎలా గడపాలి ? అనే ప్లాన్ లు షురూ :) అన్నట్టు మర్చిపోయానందోయ్ ... సమ్మర్ హాలిడేస్ కి పక్కా మా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉండేది ...దానితోనే  హాలిడేస్ కి అరంగేట్రం చేసేదాన్ని :) మాది పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల మేనత్తలు , మేనమామ లు , బాబాయ్ లు... వాళ్ళ పిల్లలు ... బోల్డంత మంది.. ఇక ఎంజైమెంట్ కి కరువేమి ఉంది:) ట్రైన్ ఎక్కి ఊర్లకి వెళ్ళడం అంటే ఎంత ఎగ్జైటింగ్ గా  ఉండేదో ! ట్రైన్ లో వచ్చే ఐస్ క్రీం లు , కూల్ డ్రింక్స్ ఏది వదలకుండ అన్నిటిని బొజ్జ లోకి పంపాల్సిందే:)

 ఫస్ట్ స్టాప్  బాబాయ్ వాళ్ళ ఇల్లు... వరంగల్ లో ఉండేది. బాబాయ్ వాళ్ళ పిల్లలు నేను కలిస్తే ఇల్లు పీకి పందిరే ! :)  అప్పుడప్పుడే కొత్త గా  స్టార్ టీవి వచ్చింది అందులో బోల్డన్ని కార్టూన్స్ వచ్చేవి. ఇక మేము పిల్లలు అందరం కలిసి ఆ కథలు చెప్పుకునే వాళ్ళం. మేము ఆడే ఆటలకు ఐతే అంతే లేదు. ఐస్ బైసు, తొక్కుడు బిళ్ళ,కరెంటు షాక్ ,క్రికెట్ , కో కో, అష్ట చెమ్మ,కచ్చ కాయలు... ఇలా అమ్మాయి  & అబ్బాయిల ఆటలు అన్ని .."కలిపి కొట్టు కావేటి రంగ" టైప్స్ లో  ఆడేసేవాళ్ళం.(ఇవ్వాళా ఎంత మంది పిల్లలకి ఈ ఆటలు తెలుసు ? పాపం ...!.ఐ.ఐ.టి ,జె .ఈ.ఈ  కోచింగ్ లు తప్ప !) దానికి తోడు మా అదృష్టానికి వీడియో గేమ్స్ ల హవా అప్పుడే మొదలు అయ్యింది . ఒక పూట రెంట్ కి తెచ్చుకుని ఆడుకునే వాళ్ళం.వీడియో గేమ్ ఇంట్లో ఉన్న రోజు మా తొట్టి గ్యాంగ్ అంతా దాని ముందే..భోజనాలకి కూడా వెళ్ళేవాళ్ళం కాదు.. ఎవరో ఒకరు అన్నం కలిపి తినిపిస్తే తప్ప :) మా పిల్లల హాలిడేస్ వల్ల పెద్ద వాళ్ళకి కూడా ఉద్యోగాలకి , పనులకి ఆటవిడుపు లా ఉండేది . ఇప్పుడు ఉన్నంత ఎండలు అప్పుడు మండే వి కాదు.. సాయంత్రానికి ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయేది వాతావరణం. పొద్దునంత ఆటలు... రాత్రి కి మాత్రం డాబా మీద పక్కలు వేసుకుని హ్యాపీ గా కబుర్లు చెప్పుకుంటూ ..వెన్నెల ని ఆస్వాదించే వాళ్ళం.


 అమ్మ కి కథలు బాగా తెలుసు ...పిల్లలు అందరికి కదంబం ముద్దలు పెడుతూ బోల్డన్ని కథలు చెప్పేది.ఇప్పటికి ఆ రోజులు తలచుకుంటే కడుపు నిండి పోతుంది. ఇలా హాలిడేస్ ఎలా గడిచిపోయేవో  కూడా తెలిసేది కాదు. స్కూల్స్ మొదలు ఔతున్నాయి అంటే ఏడుపు వచ్చేసేది..:( కాని జీవితం అంతా సమ్మర్ హాలిడేస్ లా ఉండదు కదా...! ఇక నాలో నేనే మనసుని  ని ట్యూన్ చేసుకుని నెక్స్ట్ క్లాసు కి జీవితం లో ఇంకో మెట్టు ఎక్కి నా  గమ్యానికి  చేరువ అవ్వడానికి రెడీ అయ్యేదాన్ని..!

స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు కూడా సరదాగానే ఉండేది ....కొత్త యూనిఫారం, కొత్త పుస్తకాలు... షూస్ ...కొన్న పుస్తకాలకి కవర్స్ వేసుకోవడం .. స్టికెర్స్ అంటించుకుని అమ్మ తో వాటి మీద పేర్లు రాయించుకోవడం... ఇవన్ని తలచుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది... బాల్యం ఇంత తొందరగా ఎందుకు ముగిసింది అని ... అప్పుడే బాగుండేది... భయం అంటే.... సరిగ్గా చదవక పోతే సర్ కొట్టడం .. సంతోషం అంటే సినిమా కు వెళ్ళడం , ఆడుకోవడం  ..చొక్లేట్ లు తినడం ... బాధ అంటే ... ఎగ్జామ్స్ టైం లో టీవి చూడనివ్వక పోవడం... ! ఇవే మనకు చిన్నప్పుడు తెలిసిన అర్థాలు... నిజ జీవితం లో కూడా ఈ అర్థాలు ఎప్పటికి ఇలాగే ఉంటే ఎంత బాగుండు...!

Thursday 2 May 2013

శ్వేత ABCDEFG:)

"Kottha Beggar not knowing Sun and Moon" annattuu...blog modalu pettina daggara nunchi...and ninna night nunchi naadi same to same situation... Sare motthaniki na na tantaalu padi blog aithe modalapettesanu... baane undi.. oka rendu postlu vesesa inka bagundi... vesina postlaki oka moodu commentlu kuda vacchesai.. idhi inkaa super ehey...:) Party pettaka publicity kosam politicians chese so called.... Paada yatralu Odarpu Yaatrala... types lo  naa Facebook  lo blog link paste chesesi Publicity kooda icchesukunna "Naa blog follow avvandahoooo" ... ani...( ippati daaka naa blog ni follow aina vallu okkaru kuda leru kada... and nannu follow  chesedi oke okka maa Prudhvi akka..manalo mana mata tanu eppati nuncho blogs iragadeesesthundi Found in Folsom ani )
so.. publicity kuda aipothundi... mari ippudu next enti cheyyadam ani aalochisthe.. appudu anipinchindi.. osi picchi mokhama blog start cheyyagane kaadu dantlo appudappudu postlu kooda vesi tagaladaali ani....

Sare next em raddam? ani i thinked whatto whatt ? ani :) appudu flash ayyindi Facebook lo naako friend request.. evara ani choosthe... evaro Swetha Reddy ani undi... profile click chesa photo ey mathram artham kaledu...mutual friends lo matram naa school friend Sirisha undi....evara ani chala sepu think chesa...appudu malli anipinchindi monnane kada neeku accident ayyindi so antha aalochinchaku malli leggu noppesthundi ani..:) anduke naa legguki ekkuva strain ivvakunda.. sarele edo okati... accept aithe cheddam le! ani accept chesa ( ante kottha ga party start chesina vadu kothaga blog open chesina nenu ippudu choosede public promotions kosame kada ;-) ) ala request accept chesano ledo ila tak mani message vacchindi..." Hi this is Swetha ur 7th class friend later left to Nalgonda" ani.... appudu na brain paadarasam la panichesindi... Swetha.. swetha....???hmm...oke okka friend undedi... naa bench mate.. very shy..smiling face.... naa allari chestalaki eppudu bali authoo... yeah... ABCDEFG Swetha.....:) ( tana inti peru ABC andi anduke nenu ala nick name tho pilichedanni :))

Wow! 20 years.... T.W.E.N.T.Y...Looongggggggggggggggggggggg years taruvatha suddenga ila contact loki vacchindi... super....bumper... bombastic smile:):) vacchindi naa face lo.(aa time lo Mark Zuckerberg ...kanuka naa mundu untey Oka prathyeka rashtram icchesi CM chesesedanni ;-) ee facebook valla eppudo vidipoina chaala mandi naa friends daggarayyaru.. Thanks Mark Bhai! :) neeku chakkadanala pilla vasthundi :))


20 years taruvatha antey  inko 1 year...rojuko 2 ghantala choppuna maatladina taragani maatlu...Techology punyama ani mobile numberlu exchange aipoyayi message lo chatting lu shuru ayyindi.. tanu naa pics choosi chaala shock aipoyindi... enduku antara... School lo unnappudu " Kuch kuch hota hai " movie lo 1st half lo Kajol la undedanni... ippudu  20 years taruvatha..after interval 2nd half lo Kajol la maaripoyanu kabbati :) Adaithe peddaga maaraledu ade cute eyes and sweet smile :) tanu US lo undatam moolaana tanu call chesina ikkada nenu phone answer cheyyalekapoyanu.... (intlo andaru padukuni unnaru dint want to disturb them :) endukante inni years taruvatha phone kada koncham sound ekkuva untundi.. phone ring ki and maa voice laki kooda :-P)

 So.. ee excitement ni repati daka stop cheddam anukunam.. koncham kastamaina pane aina thappaledu :( and adento coincidentally tana Birthday anta ivvala... message lo wishes cheppi inka nenu sleep loki jaarukunna repu poddunne maatladudaamani..

Morning 6.30.. edho alarm kottinattuga lechanu... identi abba?? manam intha poddunne lechasam... last 10 years lo ee time ki daridappullo kooda levaledu kada! ani anukunna...(may be naa sub consious mind backdrop lo idhe tiruguthu unnattu undi) sare lechi adi phone chestha andi kada maatladudam ani waiting start ayyindi..  8 am ayyindi.... inka tana phone raaledu.... sare ee madhya unna time lo anipinchindi elago birthday andi.. edaina gift iddamani ante ippatiki ippudu US ki emi pampalenu... so.. Swetha ki birthday gift la blog lo tana kosam oka post raddamani...( he he... virtual gift annamaata :))

so... ala start ayyindi ee post.....So.. Swethu this post is dedicated to you :) Puttina roju shubhakankshalu  chinnari snehama:)




Time 8.30 am.... inka phone raaledu... ento... eppudaithe wait chesthamo appude ee phone mogi chaavadu...

Ee.... P.H.O.N.E................................... E.P.P.U.D.U ...........R.I.N.G ..............Authundooooo..........


9 am: Phone ring ayyindi... as expected digital dolby effect lo palakarimpuls start ayyayi.. inni years nunchi unna mucchatlu anni brief ga cheppesukunnam...adento inni years taruvata matladuthunam ane feeling ee raledu.. monnane schooling complete chesinattu anipinchindi ma iddariki. School days memories anni malli nemaru vesukunnam... entho haayiga anipinchindi.... baalyam antene madhura smruthulu kada :) maa ee sneham inka eppatiki ilaage undaali untundi... anduke antaanu.. Chinnari Snehama Zindabad !