Wednesday 1 May 2013

Excuse me ! మీ బిజీ లైఫ్ లో టైం ఉందా ...!

అలారం మోతలు .. సెల్ ఫోన్ రింగులు ...న్యూస్ పేపర్  రప రపల తో మన రోజు తెల్లారుతుంది .
హడావిడి గా ఇంత ఇడ్లి నో లేక ఒక కప్పెడు కార్న్ ఫ్లేక్స్ ఓ కడుపులో పారేసి ఆఫీసుకు బయలుదేరుతాం.
ఇక ఆఫీసు కు వచ్చాక షరా మామూలే .. వర్క్ ప్రెషర్ ల తో పాటు ఆడ్ఎడ్ అడ్వాన్టేజ్ గా మేనేజర్ ల ప్రెషర్ అండ్ మన దరిద్రం పడిశం ల పట్టుకుంటే మన కలీగ్స్ ల రూపం లో అపుడపుడు కొన్ని రుస రుసలు ...కొన్ని సార్లు హ్యపినేస్సులు .

ఈ లోపు ఆ లంచ్ టైం ఎలాగో రానే వస్తుంది. ఎప్పుడో మనం చెఉకున్న పాపానికి తెల్ల దొరలూ మన దేశాన్ని వదిలి వెళ్ళినా... మనం మాత్రం వాళ్ళని వదల నందున...వాళ్ళకే  పని చేస్తున్నందున
 ( I mean ..so called MNC's ) మనం సీట్ లో నుండి లేచే నిమిషం నుంచి .. తిండి తిని వచ్చి మల్లి సీట్ లో కూర్చునే వరకు ప్రతి మినెట్టు కౌంట్ అవుతుంది .అందు వల్ల మనం స్టాప్ వాచ్ పెట్టుకుని తిన్నట్టు టపి టపీ మని తినేసి రాక తప్పదు . ఈ మధ్యలో అమ్మ దగ్గరి నుంచో . ఇంటి దగ్గర నుంచో , ఫ్రెండ్ దగ్గరి నుంచో ఫోన్ వచ్చినా... మనం చాల బిజీ. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు ఒక నిమిషం మాట్లాడి పెట్టేస్తాం ( ఔను మరి మనం బ్రతికేదే ఆఫీసు కి రావడానికి అన్నట్టు మన తొక్కలో మైండ్ సెట్ ఉంటుంది )సాయంత్రం ఇంటికి వెళ్ళాక మాట్లాడుదాం అనుకుని .ఆఫీసు అయిపోతుంది . ఇంటికి వెళ్తాం...మల్లి అదే ట్రాఫిక్  గోల మధ్యలో.( ఈ హైదరాబాదు లో కోటి నుంచి నాంపల్లి వరకు వెళ్ళే లోపు మనం పక్కన ఊరు లకి ఈజీ గా రెండు సార్లు వెళ్లి రావొచ్చు ).



బ్రతుకు జీవుడా ! అనుకుంటూ ... ఏదో ఇంట్లో పడ్డాకా ... టీవీ లో ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం అని చానల్స్ మార్చే లోపే గడియారం తొమ్మిది గంటలు కొడుతుంది.అమ్మో ... మల్లీ రేపు పొద్దున్నే ఆఫీసు కి వెళ్ళాలి అనుకుంటూ.... ఇంత తినేసి, గుడ్ నైట్ లు చెప్పేసుకుని బజ్జుంటాం!
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఇంతకి మించి డిఫరెంట్ గా సీన్ ఉండనే ఉండదు.. ఉంటె గింటే.. ఏదో అటు ఇటు చిన్న మార్పులతో తప్ప. ఇంకా మన జీవితం కాలం మొగలి రేకులు సీరియల్ లాగా ఇదే సీన్ లు నడుస్తూ ఉంటాయ్.
 
మన కోసం మనలని ప్రేమించే వాళ్ళ కోసం కొద్దిగా టైం కూడా స్పెండ్ చేయలేని దౌర్భాగ్యపు స్థితి లో ఉన్నామా మనం ?? ( లేదు అని అనే వాళ్ళకి మాత్రం దండేసి దండం పెట్టి గిన్నిస్ రికార్డ్స్ లో ఎక్కించెయ్యొచు.:-P ) రోజులు గడుస్తున్న కొద్ది మనం ఏం కోల్పోతున్నామో కూడా తెలియని అగ్యానం లో ఉన్నామేమో అనిపిస్తుంది .
మనుషులు ఎక్కువ అయ్యారు కానీ... మమతలు,రిలేషన్స్,ఎమోషన్స్ ,అన్ని .. ఇవన్ని ....రోజు రోజుకి తక్కువ అయిపోతున్నాయి. అందరి చేతులకి వాచీలు ఉన్నాయ్.. కానీ దాంట్లోని టైం మే ఎవరికీ ఉండటం లేదు!



ఇవ్వాళ పొద్దున్న మంచిగా ఉన్న వాళ్ళు రేపు ఉంటారో లేదో కూడా గ్యారెంటి ఇవ్వలేని బ్రతుకులు అయ్యిపోయినై ! ఇంత గ్యారెంటి ఇవ్వలేని జీవితాలకి ఇంతటి ఉరుకులు పరుగులు అవసరమా ?? మనం ఇంత బిజీ గా ఉంటే.... మనం కోసం ఎంతో ప్రేమగా ఎదురు చూసే హృదయాలకి , మనం కోసం ఆలోచించే మనసులకి టైం ఎవరు ఇస్తారు ???

6 comments:

  1. Replies
    1. Hey Lekha.... Thanks for ur Kekaaaaaa ;-)

      Delete
  2. అందరి చేతికి వాచ్లున్నాయి కానీ అందులో టైమే ఎవరి దగ్గర వుండడం లేదు.
    బావున్దండి ......
    నా చేతికి వాచ్ లేక పోయినా, మీ పోస్ట్ కి కామెంట్ వ్రాయడానికి మాత్రం టైం తీసుకున్నా. :)

    ReplyDelete
  3. Hey Chaitu...a very good start...keep writing..:)

    ReplyDelete
    Replies
    1. Akkoi... thank you thank you..... following your foot steps :)

      Delete