Wednesday 17 July 2013

అనుకోకుండా...!!

అబ్బా! ఏంటమ్మా.... పెళ్లి.. పెళ్లి ... అని చంపుతావ్ ? ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటున్నారు  ఇంత తొందరగా ? అండ్ moreover... ఈ పెళ్లి..  గిళ్ళి మీద నాకు నమ్మకం లేదమ్మా.. హు ! టక్.. మని ఫోన్ పెట్టేసింది "శ్రావ్య".

ఏమి .. పిల్లో ఏంటో! ఒక్క మాట చెప్పితే వినదు .. అంతా నువ్వు చేసిన గారభమే " శేఖర్ " ! అంటూ చిర్రుబుర్రు లాడుతూ వంటింట్లో కి హడావిడి గా  వెళ్లి పోయింది" సుధా  ".

శ్రావ్య .. శేఖర్ , సుధా లకు ఒక్క గానొక్క ముద్దుల కూతురు . మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఉద్యోగస్తులు. పుట్టక పుట్టక  వాళ్ళ పెళ్లి అయ్యిన చాల సంవత్సరాలకి పుట్టింది శ్రావ్య . అందుకే శ్రావ్య  ఆడింది ఆట పాడింది పాటా అయిపోయింది . "చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం " అని అన్నట్టు ... చాల సాఫీ గా సాగిపోతున్నాయి వాళ్ళ జీవితాలు .



ఇంట్లో ఏ  డెసిషన్ తీసుకోవాలి అన్నా .. ముగ్గురి సమ్మతం ఉంటేనే ఇంట్లో బిల్ పాస్ అవుతుంది :) చిన్నప్పటి నుంచి శ్రావ్య చాల చురుకైన పిల్ల అవ్వడం వల్ల అటు చదువుల్లోను .. ఇటు extra curricular activities లోను టాప్ . శేఖర్ , సుధలు ఎప్పుడైనా కస్సు బస్సు లాడుకుంటే తనే పెద్ద ఆరిందలా ... "అరుంధతి" లో బుల్లి జేజమ్మ లెవెల్ లో తీర్పులు చెప్పి ఇద్దరినీ కలిపేస్తుంది. ఎంతో బాధ్యత గా ఉండే శ్రావ్య అన్నా... తను తీసుకునే నిర్ణయాలు అన్నా ... బోల్డంత నమ్మకం ఇద్దరికీ .

శ్రావ్య హైదరాబాదు లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, జాబ్స్ కోసం అని అక్కడే హాస్టల్ లో ఉంటుంది తల్లి తండ్రులకి దూరంగా . బి.టెక్  పూర్తి అయిన అందరు గ్రాడ్యుయేట్స్  లాగానే ఒక పెద్ద  software కంపెనీ లో జాబ్ కొట్టెయ్యాలి అనేది తన aim. దాని కోసం ప్రయత్నం చేస్తూ.. ఇంటర్వూస్ కి అటెండ్ అవుతూ.. ఖాళి గా ఉండటం ఎందుకని చదువుతో సంభంధం లేక పోయిన ఎక్స్పీరియన్స్ కోసం అని " మ్యూజిక్ వరల్డ్ " లో "కస్టమర్ రిలేషన్స్ మేనేజర్" గా పని చేస్తుంది. ఈతరం ఆడపిల్ల అవ్వడం వల్ల individuality అండ్ independency కొంచం ఎక్కువే.

ఇప్పటి వరకు సూపర్ ఎక్స్ప్రెస్ లా సాగుతున్న వాళ్ళ లైఫ్ జర్నీ లో శ్రావ్య పెళ్లి ఒక పెద్ద సమస్య లా మారింది . బంధువుల ఇంట్లో ఏ పెళ్లి కి వెళ్ళినా మెరుపు లాంటి శ్రావ్య నే సెంటర్ అఫ్ అట్రాక్షన్... దానితో పెళ్లి సంభందాల తాకిడి కూడా ఎక్కువే అయ్యింది . కాని శ్రావ్య కి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్ల... అందులోను ... facebook లు twitter లు నడుస్తున్న కాలం లో పాత చింతకాయ పచ్చడి లా పెళ్లి చూపులు , అరేంజ్డ్ మ్యారేజ్ లు ... ఏంటి ? తొక్కా ! అనేది తన ఫీలింగ్ . అదే ఇప్పుడు సుధా , శేఖర్ లకి అగ్ని పరీక్షలా మారింది .


ఏంటో .. ఈ అమ్మ లు అందరు ఇంతే ... ఊ.. అంటే ఆ .. అంటే .. ఆ సంభంధం బాగుంది .. ఈ పిల్లాడు  U. S లో ఉన్నాడు , ఆ పిల్లాడు  మహేష్ బాబు లా ఉన్నాడు అంటూ..  answering మెషీన్ లా  నాన్ స్టాప్ గా చెపుతూనే ఉంటారు అనుకుంటూ....  ఆఫీసు కి చేరింది శ్రావ్య. ఇలా వచ్చిందో లేదో బాస్ దగ్గరి నుంచి ఫోన్ , ఆయన కేబిన్ కి రమ్మని. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ డెస్క్ మీద పడేసి బాస్ ని కలవడానికి వెళ్ళింది .

గుడ్ మార్నింగ్ శ్రావ్య ! మీతో అర్జెంటు గా  మాట్లాడాలి అందుకే రమ్మన్నాను. ప్లీజ్ సిట్ డౌన్ ! చాల రోజులు నుంచి గమనిస్తున్నాను మన మ్యూజిక్ స్టోర్స్ సేల్స్ చాలా తగ్గిపోతున్నాయి. దీని గురించి మీ ఇన్ పుట్స్  కావాలి. ఎలా చేస్తే మన సేల్స్ ఇంప్రూవ్ అవుతాయో చెప్పితే అది వెంటనే ఫాలో అవుదాం.  సర్ ! అన్ని మ్యూజిక్ స్టోర్స్ లా కాకుండా మనం ఒక కొత్త ట్రెండ్ ని ఎందుకు తీసుకు రాకూడదు? కస్టమర్ సర్వీస్ ని ఇంప్రూవ్ చేస్తే సేల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి అని నా నమ్మకం. ఇప్పటి నుంచి మన సేల్స్ బాయ్స్ , సేల్స్ గర్ల్స్ ని కస్టమర్స్ వచ్చినప్పుడు పర్సనల్ గా  అటెండ్ అయ్యేలా చూద్దాం. ఇదే కాకుండా కొన్ని exciting ఆఫర్స్ ని స్టార్ట్ చేద్దాం సర్ ! అంటూ .. చెప్పుతున్న శ్రావ్య వైపు మెచ్చుకోలు గా చూసాడు బాస్ . వెరీ గుడ్ శ్రావ్య! నాకు తెలుసు మీరు చెప్పినవన్నీ ఇంప్లెమెంట్   చేస్తే మనం  సక్సెస్ అవుతాం.  అప్పుడప్పుడు మీరు కూడా అన్ని  మానిటర్ చేస్తూ ఉండండి. అల్ ది బెస్ట్ ! బాస్ కేబిన్ లో నుంచి బయటపడి .. హమ్మయ్య ! అని గాలి పీల్చుకుని పనిలో నిమగ్నం అయింది శ్రావ్య .


ఈ భాగ్యనగరం లో లైఫ్ ప్రెషర్, వర్క్ ప్రెషర్ లని తట్టుకోవడానికి ఒక మంచి టైం పాస్ సంగీతం. ఎన్ని టెన్సన్స్ ఉన్నా.. రెహ్మాన్ సంగీతమో , ఇళయరాజా రాగమో వింటే చాలు చిరాకులు అన్ని హాం .. ఫట్టే ! చెలి కి దూరమైన ప్రియుడైనా , మొగుడ్స్ పైన అలిగిన పెళ్లామ్స్ అయినా , బాస్ చేతిలో తిట్లు తిన్న ఉద్యోగైనా, తొలి ప్రేమ లో చిక్కు కున్న ప్రేమికులైనా... ఎవరైతే ఏంటి ? ఎవరి మూడ్ కి తగ్గట్టు వాళ్ళకి ఒక టానిక్ లా పని చేసేది సంగీతమే అంటే అతిశయోక్తి  కాదేమో !

సాయంత్రం అయ్యింది . ఈ వేళ కస్టమర్స్ బానే ఉన్నారు . కస్టమర్స్ ని సరిగ్గా అటెండ్ అవుతున్నారో లేదో అని సేల్స్ బాయ్స్ ని గర్ల్స్ ని మానిటర్ చేస్తూ మధ్య మధ్యలో తను కూడా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది శ్రావ్య. ఇంతలో సేల్స్ గర్ల్ పద్మ ఒక కస్టమర్ దగ్గర క్వశ్చన్ మార్కు మొహం వేసుకుని నిలుచుని ఉండటం చూసి అక్కడికి వెళ్ళింది. ఏంటి ? పద్మా ? ఏమి అయ్యింది ? ఏమి లేదు మేడమ్, సార్ కి కొన్ని మంచి మ్యూజిక్ కలెక్షన్స్ కావాలంటా.. అదే ..ఏవి బాగుంటాయో చెప్పడం తెలియక ...?? అంటూ నసిగింది పద్మా. సరేలే, నేను చూసుకుంటాను.  నువ్వు వెళ్లి కొత్తగా వచ్చిన స్టాక్ ని ర్యాక్  లో సర్దు... సరే మేడమ్! అని  వెళ్లి పోయింది పద్మ.



చెప్పండి ... హౌ కాన్ ఐ హెల్ప్ యు ? అంటూ మృదు మనోహరం గా అడిగిన శ్రావ్య ని అలాగే చూస్తూ ఉండి  పోయాడు " రిషి ". ఒక్క సారి  చూస్తే మళ్ళీ  మళ్ళి  చూడాలి అని అనిపించే అందం శ్రావ్య ది. వడ్డు కు తగ్గ బరువు.. పేరుకు తగినట్టే శ్రావ్య మైన స్వరం..అన్నిటికి మించి ఆత్మ విశ్వాసం తో తొణికిసలాడే మోము. ఒకవేళ సినిమాల లో హీరోయిన్ గా ఎంటర్ అయితే " అనుష్క" కే గట్టి పోటి ఇచ్చేలా ఉంటుంది.


 రెప్ప వేయకుండా తన వైపే చూస్తున్న రిషి ని చూసి ... హలో .. సర్ ! మిమ్మలినే ... అంటూ పిలిస్తే కాని ఈ లోకం లోకి రాలేదు. ఓహ్ .. సారీ అండీ! ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను కొన్ని మంచి మ్యూజిక్ కలెక్షన్స్ కోసం వెతుకుతున్నాను. U.S లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన సాంగ్స్ వినడమే కాని అన్ని genres ఆఫ్ గుడ్ సాంగ్స్ వినడం కుదర లేదు తెలుగు లో ... నాకేమో మ్యూజిక్ అంటే ప్రాణం. సో ... మీరు నాకు కొంచం హెల్ప్ చేయగలరా ? ఓహ్.. ష్యూర్ అండి... మీకు ఎలాంటి మ్యూజిక్ అంటే ఇష్టం ? మెలోడీస్ , ఫాస్ట్ బీట్, కర్నాటిక్ ?? నాకు "మెలోడీస్ " అంటే చాలా ఇష్టం ..... బై ది వే మై నేమ్ ఈజ్ రిషి! అంటూ చెయ్యి ముందుకు చాచిన రిషి వైపు ఒక క్రీగంట చూసి.. శ్రావ్య.. హియర్ ! "కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ " అంటూ షేక్  హ్యాండ్ ఇచ్చి మనసులోనే అనుకుంది.. పర్లేదు హీరో హ్యాండ్ సమ్  గానే ఉన్నాడు. షేక్ హ్యాండ్ కూడా దొంగ షేక్ హ్యాండ్ కాదు . డీసెంట్ గానే ఉన్నాడు.. కాని U.S నుంచి వచ్చాడని  తెగ ఫోజు కొడుతున్నాడు.. తెలుగు పాటలు తెలిదంట హుహ్ ! అక్కడ రిషి కి మాత్రం గాల్లో తెలుతున్నట్టు అనిపించింది. situation కి తగ్గట్టూ...మ్యూజిక్ స్టోర్స్ స్పీకర్స్ లో నుంచి  " గాల్లో తేలినట్టుందే...  గుండె జారినట్టుందే" అని సాంగ్ వస్తుంది. తనలో తనే నవ్వుకున్నాడు. శ్రావ్య మాత్రం ఇదేమి పట్టనట్టు, మేలోడీస్ కలెక్షన్స్ కోసం తెగ వెతికేస్తుంది. ఒక పది నిమిషాల తరువాత  ఘంటసాల , A.R రెహ్మాన్,ఇళయరాజా , కీరవాణి కలెక్షన్స్ లో కొన్ని సీ. డీ లను సెలెక్ట్ చేసి ఇవి వినండి. హోప్ యు  విల్ లైక్ ఇట్ ! నాకు కూడా మేలోడీస్ అంటే ఇష్టం... సో .. నాకు తెలిసినంతలో సెలెక్ట్ చేశాను. నచ్చక పోతే మాత్రం నన్ను తిట్టుకోవద్దు అంటూ నవ్వుతూ చేతికి ఇచ్చింది . ఇచ్చినప్పుడు శ్రావ్య ముని వేళ్ళు సుతి మెత్తగా తాకి రిషి కి ఒక్క సారిగా కరెంటు షాక్ కొట్టినట్టు అయ్యింది. ఆ... ఆ.. ఆఆ... ఆఅఅ అహ్హ్హ్ ...! అని " మగధీర" లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపించినట్టు అయ్యింది కానీ ఛీ... ఎడిసావ్ ఎదవా ! మరీ అంత సినిమాటిక్ గా డ్రామా కింగ్ లా ఓవర్ ఆక్షన్ చెయ్యక .. నేను తట్టుకోలేను ! అని అంతరాత్మ అనటం తో ఉపసంహరించుకున్నాడు. శ్రావ్య ని వదిలి వెళ్ళాలని లేకున్నా సి . డీ ల కోసం వచ్చిన పని అయ్యిపోయింది ఇక వెళ్ళక తప్పదు కాబట్టి ... ఎంతో ఇబ్బంది గా బై చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుంచి మొదలు అయ్యింది రిషి లో లవ్ ఫీవర్ !




****** రిషి ఒక లవ్ సాంగ్ వేసుకుంటాడు ... ఈ లోపు మనం కొంచం బ్రేక్ తీసుకుందాం **** !! :-)
 ********************** TO BE CONTINUED ******************************































No comments:

Post a Comment