Wednesday 1 May 2013

కాలు విరిగి బ్లాగ్ లో పడ్డానే ... !! ;)

సభకు నమస్కారం :) మొత్తానికి ఇన్నాలకి అండ్ ఇన్ని రోజులకి నేను కూడా ఒక బ్లాగ్ మొదలు పెట్టాలి అనే కోరిక ఇలా పూర్తి అయ్యింది.అది కూడా చాల కామెడీ గా.... ట్రాజెడి లో ఉన్నప్పుడు ఇలా ఎంట్రీ జరిగిపోయింది . బ్లాగింగు  ప్రపంచకం లోకి విరిగిన లెగ్ ఏసుకుని ...స్టేప్పింగ్ చేసేసిన ఘనత ఫస్టు అండ్ చివరి లాస్టు నాకే దక్కుతుంది సుమీ :). జనరల్ గా" రొట్టె విరిగి నేతిలో పడినట్టు " అంటారు ... కాని నాకు కాలు విరిగి బ్లాగ్ లో పడ్డట్టు అయ్యింది .


 ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ దొరికే సరికి ఒక్క సారిగా నాలో ఉన్న ఈ బ్లాగింగు పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయి మొత్తానికి ఈ బ్లాగ్ మొదలెట్టాను..!

P .S : నేనేదో పిచ్చి పీక్స్ లో రాస్తున్నాను కాబట్టి చదివిన వాళ్ళకి కూడా అలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దని మనవి చేస్కుంటున్నాను :-P

సరే ఇక ఎలాగో రాయడం మొదలెట్టాను కాబట్టి ఫస్ట్ ఫస్ట్న ఏటి రాద్దాం అనుకుంటుంటే అప్పుడు అనిపించింది... కూసంత నా గురించి ఇంట్రడక్షన్ లు ఇచ్చేసుకుందాం అని... సో...కథ ఇలా మొదలు అయ్యింది.....

అనగనగ ఒక నేను..చిన్నప్పటి నుంచి నాకో ఎదవ ఫీలింగ్ ఉండేది..నేను అసలు కత్తి..కతర్నాక్..చాకు..! పెద్దగ అయ్యాక ఓ తెగ చింపేస్తాను, ఫుల్ ఫేమస్ పర్సనాలిటీ అయ్యిపోయే లచ్చనాలు నాలో చాల ఉన్నాయ్ అని. అందుకే కామోసు మా అమ్మ.. మనకు ఉన్న అరవై నాలుగు  కళలో ఓ పది కళలో నన్ను ఎన్కరేజింగ్ చేసేసింది . నేను కూడా బానే నేర్చుకున్నాను అనుకోండి... కానీ దేన్ట్లోను ఎక్కువ దూరం ట్రావెలింగు సేయలేక పోయాను. అదేదో ఇంగ్లిపీసు సామెత ఉంది కదా " జాక్ అఫ్ అల్ ట్రేడ్స్ మాస్టర్ అఫ్ నన్" అని..అది ఎగ్జాట్లీ  మనకు సరిపోతుంది.... కాదేస్స్.. నా కోసమే క్రియేట్ చేసారు .

డాన్సు, స్పోర్ట్స్, ఆర్ట్స్... ఇలా దేన్నీ వొదిలి పెట్టలేదు . ముద్దుగా పదహారు అణా ఆడపిల్ల లా ఉండాలి అని కూచిపూడి డాన్సు స్కూల్ లో చేరిపిస్తే మనం ఏమో నో "తత్తై తః దిత్తై తాహా " అని ..చిరు సినిమాలు చూసి ఏకలవ్య శిష్యురాలిని అయిపోయి" గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్ " అంటూ టీవి ముందు స్టెప్పులు వేసే దాన్ని. So , శోభ నాయుడు అంతటి డాన్సర్ ని అవుతాను అని మా పెద్దోళ్ళు అనుకుంటే నేను మాత్రం మా స్కూల్ లో ఒమేగా స్టార్ ని అయిపోయా. సరే కనీసం ఒక బాడ్మింటన్ ఓ చేస్సో నేర్చుకున్నందుకు ఒక జ్వాల గుట్టా నో ఒక కోనేరు హంపి నో అవ్వాల్సిన దాన్ని లోకల్ ప్లేయర్ దగ్గరే ఆగిపొయా....




సో ఇక లాభం లేదు అనుకుని .." లైట్  తీస్కో భయ్యా లైట్ తీస్కో" అని ప్రభాస్ ఎలాగో చెప్పాడు కదా అని లైట్  తీసేసుకున్న. కానీ... ఎక్కడో ఒక సైడ్ అఫ్ హార్ట్ లో ( మోస్ట్లీ left సైడ్ ఎ అనుకుంటా..:-D ) ఏదో చిన్న ఫీలింగ్.. నాకోసం నేను ఏది చేసుకోలేక పోయానే అని..

మొత్తానికి నేను కూడా అందరి లాగానే అదంతా మర్చిపోయి ఈ బిజీ బిజీ లైఫ్ పెట్టె రన్నింగ్ రేస్ లో ఒక్కోసారి గమ్యాన్ని చేరుకుంటూ అప్పుడప్పుడు దారి తప్పిపోతు బ్రతుకు బండిని నడిపించా... అప్రైసల్స్ కోసం ఆరాటం, హైక్ ల కోసం పోరాటం చేస్తూ... మధ్య మధ్య లో ఒక ఆఫీసు నుంచి ఇంకో ఆఫీసు కి మారుతుండటం వాళ్ళ రక రకాల స్పీసీస్.. ఓహ్ ... సారీ ...పీపుల్స్ మధ్యలో వర్క్ చేసే మహాభాగ్యం కలిగింది.

జీవితం లో జరిగిన సంఘటనలు చాల నేర్పించాయి. కానీ... ఇప్పటికి నాకు నా మనసుకు ఎప్పుడు కుంగ్ ఫూ జరుగుతూ ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకున్నావా? అని. అందుకే దానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్న. అప్పుడు నాకు అనిపించినది ఒకే ఒక్కటి బ్లాగ్ స్టార్ట్ చేయాలి.. ఎస్స్ ... నాలో ఉన్న క్రియేటివ్ బుర్ర కి పదను పెట్టాలి ... నా ఊహలు.. నా ఆలోచనలు ..నాఇన్స్పిరేషన్స్..క్రియేటివిటీ అన్నీ... మల్లి రిఫ్రెష్ చేయాలి. నేను ఎనేర్జైస్ అవ్వాలి .

ఎంతైనా మా అమ్మ కూతురిని కదా .. ఒక సాహితి తృష్ణ ఉన్న తల్లి కి కూతురిని అయినందుకు కొద్దో గొప్పో నాలో కూడా ఎక్కడో చుట్కు పుట్కు కళాపోషణ దాగి ఉంది .. దానిని ఇప్పుడు ఎక్స్ ప్లోర్ చేస్తున్నా:)

"మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలా " అని మన రావు గోపాల రావు తాత ఎప్పుడో అన్నారు కాదేటి ! :)





 So............... Here i come into the Blogging world in the search of real me :)

 

9 comments:

  1. వెల్కమ్ వెల్కమ్ టు బ్లాగ్ వరల్డ్ .
    బాగా రాస్తున్నారు, తెలుగు ని తెలుగులోనే రాస్తే ఇంకా బాగుంటుంది. మీ టెంప్లెట్ కూడా చాలా ఆహ్లాదకరం గా ఉందండి.
    మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, మీ బ్లాగ్ లో మొదటి కామెంట్ పెట్టేస్తున్నా :-)

    ReplyDelete
    Replies
    1. mee comment ki ధన్యవాదములు. తెలుగులో రాయటానికి ఇబ్బంది ఏమి లేదండి. కాకపోతే ఈ రోజుల్లో తెలుగు వచ్చినా అది తెలుగు లో రాస్తే చదవలేని వాళ్ళు చాల మంది ఉన్నారు. అందుకే అందరికి అర్థం అవుతుంది కదా అని తెలుగుని ఇంగ్లీష్ లో రాస్తున్నాను .

      Delete
  2. Hehehe...rani vallu danni google translator lo translate chesukuntarle sister...nuvvu telugu rayi yeha...kaani naa comment lu matram english lone pedatane..naku excuse :P

    ReplyDelete
    Replies
    1. ha ha... Akka.. neeku okkati enti boldanni excuses aapke naame :) hmm.. raasatha sister kooni ala konni ila...:)naa routeeee seperatuuuu :-P

      Delete
  3. చాలా బా(బ్లా)గుంది. శైలి భళా. రాణి కూతురనిపించావ్. ఈ మధ్య ఏం రాయట్లేదేంటి. అభిమానులం ఎదుర్చూస్తున్నాం.- మామ్స్.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు మామ్స్ :) అన్ని కామెంట్లు ఒక ఎత్తు అయితే మీ కామెంటు ఒక ఎత్తు :) పోయిన వారం రాయలేదు ... ఈ వారం తప్పకుండ రాస్తాను :) అమ్మ కూతురిని అనిపించుకోవాలనే నా ఆరాటం ఎప్పటికి ఇలాగే ఉంటుంది :)

      Delete
  4. హహహ కాలువిరిగి బ్లాగ్ లో పడ్డానంటూ భలే ఫన్నీగా చెప్పారండీ :-) పథ్యంలాంటివి జాగ్రత్తగా పాటిస్తూ కాలికి పూర్తి రెస్ట్ ఇచ్చి త్వరగా నయం చేసేస్కోండి. గెట్ వెల్ సూన్.

    ఇక మీ బ్లాగ్ విషయానికి వస్తే బాగుంది, బాగా రాస్తున్నారు. టెంప్లేట్ కూడా చాలా చక్కగా ఉంది. అక్కడక్కడా కాస్త అక్షరదోషాలు దొర్లుతున్నాయి ప్రూఫ్ రీడ్ చేస్కోండి మీరే సరి చేయగలరు. గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ విత్ యువర్ బ్లాగింగ్. కాలు సరి అవగానే రొటీన్ లో పడి బిజీ అయిపోయి శీతకన్నేయకుండా తరచుగా రాస్తుండండి :-)

    ReplyDelete
    Replies
    1. @ వేణు గారు.ధన్యవాదాలు :) ఔను అండి కొన్ని అక్షర దోషాలు ఉన్నాయ్.. వాటిని సరిచేస్తాను :) హహ.. నా కాలు విరిగి బ్లాగ్ లో పడ్డ మాట నిజమే కాని..కాలు సరి అయినాక కూడా నా మనసు ఈ బ్లాగ్ లోనే ఉంటుంది.. కాబట్టి సీత కన్ను వేయను లెండి :) థాంక్స్ ఫర్ యువర్ valuable ఫీడ్ బ్యాక్ :)

      Delete
  5. మీలో ఉన్న క్రియేటివ్ బుర్రకి పదను పెట్టి కళాపోషణ సాగించాలాని కోరుకుంటా

    ReplyDelete