Thursday 25 July 2013

అనుకోకుండా...!! 2వ భాగం

అబ్బాయిలకి యుక్త వయసు వచ్చిందంటే ఏ విషయం లో క్లారిటీ లేకున్నా ఒక్క విషయం లో మాత్రం పిచ్చి క్లారిటీ ఉంటుంది. అదే .... వాళ్ళు ప్రేమించే అమ్మాయి గురించి... అది ముదిరాక ఆమెతో పెళ్లి గురించి :-) రిషి పరిస్థితి ఆ మొదటి స్టేజి దాటి రెండో స్టేజి లో ఉంది. "పెళ్ళాం"  అంటే శ్రావ్య లా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాడు.
ఎలాగో అయ్యాడు కాబట్టి , నెక్స్ట్ స్టెప్ తన ప్రేమ సంగతి చెప్పెయ్యాలి. కానీ...?? తనకంటే లవ్" అట్ ఫస్ట్ సైట్ " లాగా హార్ట్ లో బెల్స్ రింగ్ అయ్యాయి...  అలాగే  శ్రావ్య కి కూడా  రింగ్ అవ్వాలని లేదు కదా! అదీ కాక ఇందాకే చూసిన  అమ్మాయితో " ఐ లవ్ యు " అంటే మొదటికే మోసం వస్తుందని, మొదలు ఆమెతో పరిచయం పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అప్పటి నుంచి రిషి ఏదో ఒక వంక తో శ్రావ్య పని చేసే మ్యూజిక్ స్టోర్స్ కి వెళ్ళడం,తనతో కొంచం సేపు మాట్లాడటం, ఏదో ఒక సి. డీ కొనుక్కొని  రావడం పరిపాటి అయ్యింది.ఇలా ఫ్రీక్వెంట్ గా రిషి రావడం పై అక్కడ పని చేసే సేల్స్ గర్ల్స్ అందరిలో ఒక పెద్ద హాట్  టాపిక్ అయ్యిపోయింది.కొందరు సంగీతం పిచ్చోడు అనుకున్నారు, కొందరు డబ్బులు ఎలా కర్చుపెట్టలో తెలియక ఏవేవో సీ. డీ లు కొంటున్నాడు అనుకున్నారు.. ఇంకొందరు మాత్రం...  ఏదైతే ఏంటి కుర్రాడు హీరో లా ఉన్నాడు కొంచెం సేపు లైటింగ్ కొట్టుకోవచ్చు లే అనుకున్నారు :-) ఎందుకంటే ఒక అమ్మాయి ఇష్టపడటానికి ఏవైతే   క్వాలిటీస్  ఉండాలో అందులో దాదాపు వాటిల్లో  రిషి కి  ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అందగాడు, ఆజానుబాహుడు, జోవియల్ , ఫ్రెండ్లీ, వీటన్నిటికి కొస మెరుపులా మాంచి స్మైలింగ్ ఫేసు.
అన్నీ బాగానే ఉన్నాయి కాని ఎందుకనో శ్రావ్య మాత్రం రిషి ని  అంతగా పట్టించుకోవటం లేదు. అదే  రిషి కి ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్??? "ఎన్ని చూపులు తన   వైపు చూసినా.... నా చెలియ  చూపు కి మాత్రం  నోచుకోక పోతినే ...  ఏమి నా దౌర్భాగము" ! అంటూ కవిత్వాలు కూడా రాసేసుకున్నాడు!



శ్రావ్య ఆఫీసు అయిపోయింది. తన హాస్టల్ కి వెళ్ళడానికి  బస్సు స్టాప్  కి చేరి వెయిట్ చేస్తోంది. అదేంటో? సడన్ గా నిన్నటి దాక మండిన సూరీడు ఇవ్వాళా చల్లబడి పోయాడు. దానికి తగినట్టు మబ్బులు కమ్ముకున్నాయి. ఈ బస్సు ఏమో ఎంతటికీ రాదాయే! ఇప్పుడు ఈ బస్సు కోసం ఎవడు వెయిట్ చేస్తాడులే! అనుకుని ఆటో కోసం వెళ్లబోయే అంతలో, ఉరుములు మెరుపులతో వర్షం మొదలు అయ్యింది. దానితో మల్లి బస్సు స్టాప్ వైపు పరుగులు తీసింది శ్రావ్య. ఇంతలో ఎవరో పిలిచినట్టు వినిపించి వెనక్కు తిరిగింది. ఎవరా? అని చూస్తే కార్ లో రిషి. శ్రావ్య గారు తొందరగా రండి నేను డ్రాప్ చేస్తాను. నేను మీ హాస్టల్ వైపే వెళుతున్నాను. వద్దు.. రిషి గారు, నేను వెళ్ళిపోతాను మీరు వెళ్ళండి. అబ్బా.. పర్లేదండి నా కారు ఏమి అరిగిపోదు మీరు కూర్చుంటే అంటూ నవ్వాడు. అమ్మో! మా హాస్టల్ లో ఎవరైనా ఇలా నేను కారు లో దిగడం చూసారు అంటే గోవిందో.. గోవిందా ! నా ఫ్రెండ్స్ నన్ను క్వశ్చన్ లతోనే చంపేస్తారు. సారీ.. ఏమి అనుకోవద్దు ప్లీజ్ మీరు వెళ్ళండి... లిఫ్ట్ ఆఫర్ చేసినందుకు థాంక్స్!

 ఇందాకటి నుంచి వీళ్ళ మాటలని వింటున్న బస్సు స్టాప్ లోని జనాలు ఇద్దరినీ ఎగా దిగా చూడటం తో రిషి ఇక ఏమి అనలేక.... ఎలా ఒప్పించాలి చెప్మా??..." నాయనా రవి తేజ... నీ  సినిమాలలో ఐతే ఇట్టే పడిపోతారు హీరోయిన్ లు"  అని అనుకునే లోపు ..... లవ్ స్టొరీ లో విలన్ లా బస్సు రానే వచ్చేసింది. శ్రావ్య బస్సు ఎక్కేసి వెళ్ళిపోయింది" బై " చెప్పడం రిషి వంతు అయ్యింది. హాస్టల్ కి వెళ్ళగానే శ్రావ్య తన డైరీ లో రాసుకుంది " ఐ లవ్ APSRTC " అని !



రిషి కి చాల భాద గా ఉంది. "మనం ప్రేమించిన వాళ్ళు మన ప్రేమని అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ"... తన ప్రేమని శ్రావ్య అర్థం చేసుకోలేక పోతుందని హీరో గారి ఆవేదన. కాని ఎందుకో ఆ ఆవేదన లో కూడా రిషి కి శ్రావ్య మీద ప్రేమ ఎక్కువ అవుతుందే కాని తక్కువ మాత్రం అవ్వడం లేదు... ప్రేమంటే ఇదేనేమో? అనుకున్నాడు. ఎన్ని సినిమాలు చూడలేదు especially మణిరత్నం సినిమాలు... ప్రేమలో పడ్డ వాళ్ళకి , పడాలి అనుకునే వాళ్ళకి ఆయన తీసిన "గీతాంజలి ", " సఖి ", "బొంబాయి" గైడ్స్ లాంటివి.దానికి తోడు ఇళయరాజా, రెహమాన్ సంగీతం ప్రేక్షకులని ఎక్కడికో....... తీసుకెళ్ళి పోతుంది. ఇక ప్రేమికుల సంగతి అయితే అల్లాహ్ హీ జానే! :-) అంటే ఇప్పుడు మణిరత్నం సినిమాలు మన టాపిక్ కాదు .. ఆ సినిమాలలో హీరో లు తమ ప్రేయసి కై పడే ఆవేదన same టు same  రిషి పడుతున్నాడు అని చెప్పడానికి.. మీకు ఆ ఎఫెక్ట్ తెప్పించడానికి మాత్రమే ఇలా ప్రస్తావించాను :-)

ఇంకో నెల రోజుల్లో రిషి US కి వెళ్లిపోవాలి. శ్రావ్య కలవక పోయి ఉంటే తనకు ఈ పరిస్థితి లో పెద్దగా ఏమి అనిపించక పోయేది. ఎంత వద్దు.. అన్నా.. రెప్ప వెయ్యకుండా చూడాలి అనిపించే అందమైన మోము, చిన్న పిల్ల లాంటి స్వచ్చమైన చిరునవ్వు, కల్మషం లేకుండా అందరితో కలిసిపోయే తత్త్వం.. అన్నిటికి మించి ఆమె కి ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్... మాగ్నెట్ లా రిషి ని శ్రావ్య కి attract చేస్తున్నాయి . ఇక ఈ విరహము నేను ఓపలేను ! అనుకుని... ఎలాగైనా శ్రావ్య కి తన ప్రేమ విషయం చెప్పేద్దాము  అని ఫిక్స్ అయ్యాడు.

ఎప్పుడు వెళ్ళినట్టే మ్యూజిక్ స్టోర్స్ కి వెళ్ళాడు.. శ్రావ్య చాల సీరియస్ గా వర్క్ లో మునిగిపోయి ఉంది . హలో ! గుడ్ మార్నింగ్ ... శ్రావ్య గారు.. ఓహ్ ! రిషి గారు మీరా ? ఎంటండి.. ఇంత పొద్దున్నే సంగీతం మిమ్మలిని పిలిచిందా ? అని నవ్వింది. లేదండి.. మీరే నన్ను రప్పించుకున్నారు ! ఒక్క సారి ఆ మాట వినే సరికి శ్రావ్య కి ఏమి అనాలో అర్థం కాలేదు. రిషి మాత్రం తన వైపే సూటిగా చూస్తూ ఉండటం తో ఏమి వినిపించనట్టు అక్కడి నుంచి వెళ్ళబోయింది , శ్రావ్య గారు ! ఆగండి. నేను మీ కోసమే వచ్చాను. మీతో మాట్లాడాలి. మీ వర్క్ ని ఏమి డిస్టర్బ్ చెయ్యను, ఇవ్వాళా.. మీ ఆఫీసు ఐపోయాక మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు రాలేదు అంటే ఇంకెప్పుడు మీకు కనిపించను! అని చెప్పేసి విస విస వెళ్ళిపోయాడు రిషి .

శ్రావ్య ఈ ఊహించని పరిస్థితి కి హతసురాలు అయ్యింది . చేస్తున్న పని బుర్ర కి ఎక్కడం లేదు. సాయంత్రం ఎలా అయ్యిందో కూడా తెలియలేదు. తనకి చాల టెన్షన్ గా ఉంది .బుర్ర లో ఎన్నో ఆలోచనలు . సాయంత్రం ఏమి చెప్తాడు ? కొంపదీసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడా?   ప్రేమ.. అంటేనే నమ్మకం లేదు.. అందులోను రిషి గురించి తనకి పెద్దగా ఏమి తెలీదు.. ఏదో కొద్ది రోజుల పరిచయం. అమ్మ, నాన్న తన మీద ఎంతో నమ్మకం తో ఒక్కదాన్ని హాస్టల్ లో జాబు కోసం ఉంటాను అనగానే ఏదో సాధిస్తాను అనుకుని ఉంచారు. ఇప్పుడు ఈ నమ్మకాన్ని తను బ్రేక్ చెయ్యలేదు.. సో.. సాయంత్రం 6.30 కే ఆఫీసు లో తన పని అయిపోయినా శ్రావ్య ఆఫీసు నుంచి వెళ్ళలేదు. అయ్యాక ఆఫీసు బయటకి వచ్చి చూసింది. రిషి ఎక్కడ కనబడలేదు. వాచ్ చూసుకుంది 7.30 అయ్యింది .. చాల లేట్ అయ్యింది. తొందరగా హాస్టల్ కి వెళ్ళాలి అని .. బస్సు స్టాప్ వైపు అడుగులు వేస్తుంటే సన్నగా చినుకులు మొదలు అయ్యాయి. ఉరుకు లాంటి నడక తో వెళుతున్న శ్రావ్య తల మీద ఎవరో గొడుగు పట్టినట్టు అనిపించి పక్కకు చూస్తే... రిషి.



 ఎంతో... ప్రేమ నిండిన కళ్ళ తో తన వైపే చూస్తున్నాడు. ఆ చూపులో శ్రావ్య కి రిషి ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పలేక పోయాడో అది చెప్పకుండానే కనిపించింది. అయినా చాల మొండిగా గొడుగు నుంచి పక్కకు తప్పుకుంటూ... ఏంటి? మీరు ఇంకా ఉన్నారా ? ఆఫీసు ఐపోయాక రాక పోతే ఇంకెప్పుడు కనపడను అన్నారు ? అదీ కాక మీరు నాతో పర్సనల్ గా మాట్లాడేది ఏముంటుంది చెప్పండి? రిషి ఏమి మాట్లాడలేదు. సైలెంట్ గా మళ్ళి గొడుగు శ్రావ్య వైపు పడుతూ.. వర్షానికి ప్రేమకి ఏమి లింక్ ఉందో  తెలియదు కాని.. నాకు మాత్రం నీతో ఇలా వర్షం లో ఒకే గొడుగు కింద నడవడం  ... చాలా మెమోరెబుల్ శ్రావ్య !.. 6.30 వరకు నీ కోసం ఆఫీసు బయట ఎదురు చూసి నువ్వు రాక పోయే సరికి ఇంకెప్పుడు నీకు కనపడ కూడదు అని అనుకున్నాను. కాని 6.31 కి నువ్వంటే నాకు ఏంటో.. అర్థం అయ్యింది. నువ్వు లేని  ఆ ఒక్క నిమిషం కూడా నాకు ఒక యుగం లా తోచింది, ఈ ఒక్క గంట  నాకు ఒక జీవితం లా అనిపించింది. నాకు మంచి కుటుంబం, మంచి ఉద్యోగం, నా కోసం ప్రాణం ఇచ్చే  ఫ్రెండ్స్..అన్ని.. ఇవన్ని ఉన్నాయి... ఒక్క" నువ్వు" తప్ప !  నా  లైఫ్ లో ఎన్ని ఉన్నా అందులో నువ్వు లేకపోతే ఇవన్ని వేస్ట్ ! అందుకే ఇది నీకు చెప్పకుండా వెళ్ళలేక పోయాను   .... " ఐ లవ్ యు"  శ్రావ్య ! అని శ్రావ్య వైపు తిరిగాడు. అక్కడ శ్రావ్య లేదు. వె. ళ్ళి . పో . యి . o . ది !! చెప్పకుండా వచ్చిన వర్షం లాగా!

 తనను, తన ప్రేమ ను కాదని, చాలా సింపుల్ గా సైలెంట్ గా వె. ళ్ళి . పో . యి . o . ది!  రిషి కళ్ళలో నీళ్ళు  తిరిగాయి.. తన కింద నేల కుంగిపోతున్నట్టు అనిపించింది.. గమ్యం తప్పిన బాటసారి లా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.




******రిషి ప్రయాణం ఎక్కడికో ??? రిషి ని కాదని వెళిపోయిన శ్రావ్య జీవితం ఏ మలుపు తిరుగుతుందో... ??

                                        ******     ముగింపు వచ్చే వారం! ******