Wednesday 15 May 2013

సమ్మర్ హాలిడేస్ :-)

సమ్మర్ హాలిడేస్ .... వేసవి కాలం సెలవులు... అబ్బా....ఈ మాట వింటే చాలు చిన్నప్పుడు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసేది :) ఎందుకు రాదు మరి... అప్పటి వరకు సంవత్సరం పొడుగునా పొద్దు పొద్దున్నే ట్యూషన్స్ అని.. స్కూల్ అని.. ఎగ్జామ్స్ వస్తే నైట్ ఔట్స్ , కంబైన్డ్ స్టడీస్ అని ...నా లాగా  మాథ్స్ లో పొట్ట కోస్తే ఒక్క ఆల్జీబ్రా కూడా రాని వాళ్ళ సంగతైతే గోవిందో గోవిందా!  అచ్చ బాబోయ్... ఇన్ని టెన్సన్స్, కాంప్లికేషన్స్ మధ్య గడిచిన... ఉరుకుల పరుగుల జీవితానికి కాసేపు విశ్రాంతి... సమ్మర్ హాలిడేస్! ఆహా.. ఎవడు కనిపెట్టాడో కానీ ఈ సమ్మర్ హాలిడేస్ ని వాడికి పొద్దున్న, సాయంత్రం సాష్టాంగ నమస్కారాలు పెట్టెయ్యాలి అనిపించేది. ఫైనల్ ఎగ్జామ్స్ అపుడు మనం రాసే చివరి ఆఖరు ఎగ్జామ్ రోజున ఉంటుంది చూడండి ఆ... మజా... ఆహా...వర్ణనాతీతం... నేను అయితే ఆ ఇయర్ నోట్ బుక్స్ అన్ని పర పరా చింపేసి  చింపాంజీ డాన్సులు చేసేదాన్ని:) స్కూల్ బస్సు లోనే హడావిడి మొదలు అయ్యేది.. నా లాంటి తుంటరి పిల్లకాయలు  అంతాక్షరి లు , ఎగ్జామ్ రాసే ప్యాడ్  ని క్రికెట్ బ్యాట్  లా చేసి టెక్స్ట్ బుక్స్ లోని పేపర్స్ ని బాల్ లా చేసుకుని సచిన్ లెవెల్ లో క్రికెటు మ్యాచ్ లు ఆడుకుంటుంటే ... ఇంకో వైపు చదువే ప్రాణం.. చదువే లోకం... లా ఉండే మేధావి వర్గం పిల్లకాయలు అంతా... క్వశ్చన్ పేపర్స్ ని పట్టుకుని ఈ బిట్టు కి ఆన్సర్ ఏంటి? ఆ క్వశ్చన్ కి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి అని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు లు పెట్టేవాళ్ళు :) మొత్తానికి ఎలాగో ఈ ఇయరు చదువులు అయిపోయినై ..ఎంచక్కా... ఒక రెండు నెలలు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చెయ్యొచ్చు అనే ఆనందం ఒక పక్క ఉంటే , సమ్మర్ హాలిడేస్ తరువాత రిజల్ట్స్ ఏమి వస్తాయో అనే టెన్షన్ ఒక పక్క ఉండేది. ( అప్పుడు అర్థం కాలేదు  చిన్నప్పటి  నుంచే... సంతోషం ఉన్న దగ్గర దుఖం కూడా ఉంటుందనే జీవిత సత్యం మనకి మెల్లగా నరాలలోకి ఎక్కించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు  అని ) ఏదైతే ఏంటి  జో హోగా దేఖ జాయేగా! అనుకుని   ఫ్రెండ్స్ అందరికి బై బై లు టాటా లు హాలిడేస్ కి వెల్కమ్  చెప్పేసే దాన్ని :)


ఒక వారం రోజులు ఇంటి పట్టున ఉండి మిగితా నెల రోజులు ఎలా గడపాలి ? అనే ప్లాన్ లు షురూ :) అన్నట్టు మర్చిపోయానందోయ్ ... సమ్మర్ హాలిడేస్ కి పక్కా మా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉండేది ...దానితోనే  హాలిడేస్ కి అరంగేట్రం చేసేదాన్ని :) మాది పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల మేనత్తలు , మేనమామ లు , బాబాయ్ లు... వాళ్ళ పిల్లలు ... బోల్డంత మంది.. ఇక ఎంజైమెంట్ కి కరువేమి ఉంది:) ట్రైన్ ఎక్కి ఊర్లకి వెళ్ళడం అంటే ఎంత ఎగ్జైటింగ్ గా  ఉండేదో ! ట్రైన్ లో వచ్చే ఐస్ క్రీం లు , కూల్ డ్రింక్స్ ఏది వదలకుండ అన్నిటిని బొజ్జ లోకి పంపాల్సిందే:)

 ఫస్ట్ స్టాప్  బాబాయ్ వాళ్ళ ఇల్లు... వరంగల్ లో ఉండేది. బాబాయ్ వాళ్ళ పిల్లలు నేను కలిస్తే ఇల్లు పీకి పందిరే ! :)  అప్పుడప్పుడే కొత్త గా  స్టార్ టీవి వచ్చింది అందులో బోల్డన్ని కార్టూన్స్ వచ్చేవి. ఇక మేము పిల్లలు అందరం కలిసి ఆ కథలు చెప్పుకునే వాళ్ళం. మేము ఆడే ఆటలకు ఐతే అంతే లేదు. ఐస్ బైసు, తొక్కుడు బిళ్ళ,కరెంటు షాక్ ,క్రికెట్ , కో కో, అష్ట చెమ్మ,కచ్చ కాయలు... ఇలా అమ్మాయి  & అబ్బాయిల ఆటలు అన్ని .."కలిపి కొట్టు కావేటి రంగ" టైప్స్ లో  ఆడేసేవాళ్ళం.(ఇవ్వాళా ఎంత మంది పిల్లలకి ఈ ఆటలు తెలుసు ? పాపం ...!.ఐ.ఐ.టి ,జె .ఈ.ఈ  కోచింగ్ లు తప్ప !) దానికి తోడు మా అదృష్టానికి వీడియో గేమ్స్ ల హవా అప్పుడే మొదలు అయ్యింది . ఒక పూట రెంట్ కి తెచ్చుకుని ఆడుకునే వాళ్ళం.వీడియో గేమ్ ఇంట్లో ఉన్న రోజు మా తొట్టి గ్యాంగ్ అంతా దాని ముందే..భోజనాలకి కూడా వెళ్ళేవాళ్ళం కాదు.. ఎవరో ఒకరు అన్నం కలిపి తినిపిస్తే తప్ప :) మా పిల్లల హాలిడేస్ వల్ల పెద్ద వాళ్ళకి కూడా ఉద్యోగాలకి , పనులకి ఆటవిడుపు లా ఉండేది . ఇప్పుడు ఉన్నంత ఎండలు అప్పుడు మండే వి కాదు.. సాయంత్రానికి ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయేది వాతావరణం. పొద్దునంత ఆటలు... రాత్రి కి మాత్రం డాబా మీద పక్కలు వేసుకుని హ్యాపీ గా కబుర్లు చెప్పుకుంటూ ..వెన్నెల ని ఆస్వాదించే వాళ్ళం.


 అమ్మ కి కథలు బాగా తెలుసు ...పిల్లలు అందరికి కదంబం ముద్దలు పెడుతూ బోల్డన్ని కథలు చెప్పేది.ఇప్పటికి ఆ రోజులు తలచుకుంటే కడుపు నిండి పోతుంది. ఇలా హాలిడేస్ ఎలా గడిచిపోయేవో  కూడా తెలిసేది కాదు. స్కూల్స్ మొదలు ఔతున్నాయి అంటే ఏడుపు వచ్చేసేది..:( కాని జీవితం అంతా సమ్మర్ హాలిడేస్ లా ఉండదు కదా...! ఇక నాలో నేనే మనసుని  ని ట్యూన్ చేసుకుని నెక్స్ట్ క్లాసు కి జీవితం లో ఇంకో మెట్టు ఎక్కి నా  గమ్యానికి  చేరువ అవ్వడానికి రెడీ అయ్యేదాన్ని..!

స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు కూడా సరదాగానే ఉండేది ....కొత్త యూనిఫారం, కొత్త పుస్తకాలు... షూస్ ...కొన్న పుస్తకాలకి కవర్స్ వేసుకోవడం .. స్టికెర్స్ అంటించుకుని అమ్మ తో వాటి మీద పేర్లు రాయించుకోవడం... ఇవన్ని తలచుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది... బాల్యం ఇంత తొందరగా ఎందుకు ముగిసింది అని ... అప్పుడే బాగుండేది... భయం అంటే.... సరిగ్గా చదవక పోతే సర్ కొట్టడం .. సంతోషం అంటే సినిమా కు వెళ్ళడం , ఆడుకోవడం  ..చొక్లేట్ లు తినడం ... బాధ అంటే ... ఎగ్జామ్స్ టైం లో టీవి చూడనివ్వక పోవడం... ! ఇవే మనకు చిన్నప్పుడు తెలిసిన అర్థాలు... నిజ జీవితం లో కూడా ఈ అర్థాలు ఎప్పటికి ఇలాగే ఉంటే ఎంత బాగుండు...!