Friday 31 May 2013

ఆప్యాయతల కి దారేది ??

ఒక్కోసారి జనాలని .. ప్రపంచకాన్ని చూస్తుంటే భయం  వేస్తుంటుంది.దిన దినం ప్రవర్ధమానం చెందినట్టు మన భాష, జీవన  విధానం, మన పరిసరాలు , మనం వాడే టెక్నాలజీ నుంచి అన్నిటి లోను పరిణితి చెందిన మనం.. డెవలప్ అయ్యామా ? లేక ఇంకా రోజు రోజు కి అధో పాతాళానికి దిగాజారిపోతున్నామో ...  అర్థం కావటం లేదు! మన మధ్య దూరాలు తగ్గించడానికి కనుక్కున్నటెక్నాలజీ దూరాలు తగ్గిస్తుందా ? లేక ఇంకా దూరాలని పెంచుతుందా ? మీరేమంటారు ??


ఫేస్ బుక్ ,  ట్విట్టర్ లు  లో లేచిన దగ్గరి నుంచి ( కాదు..  కాదు దగ్గినా  తుమ్మినా  అంటే బాగుంటుందేమో:)) అప్ డేట్ ల మీద అప్ డేట్ లు ఇచ్చే మనం..  కమ్యూనికేషన్ లో "తోప్స్" అయ్యిన  మనం .... నిజం గానే భంధాలకి భాంధవ్యా లకి అప్ టూ  డేట్ గా ఉన్నామా ??



 నాకైతే ఉన్నా  కూడా లేము అనే అనిపిస్తుంది ... ఎందుకు ? అంటారా? ( ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మీకు కూడా నా లాగే అనిపిస్తుంది కచ్చితం గా.. ఇవ్వాల్టి జనరేషన్ కి తప్ప !) ఒకప్పుడు ఈ కేబుల్ టీవీ మోతలు,మొబైల్ ఫోన్ ల కూతలు, ఇంటర్నెట్ టెక్కులు ఇవేవి లేవు కనుక... అప్పుడు ఇంట్లో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే గొప్ప. (వీధి లో ఒకరు ఇద్దరికే ఉండేది. అవసరానికి వాళ్ళ నెంబర్ లని ఇచ్చుకునే వాళ్ళం. ఎవరి కన్నా ఫోన్ వస్తే వాళ్ళు వచ్చి పిలిస్తే అప్పుడు వెళ్లి మాట్లాడి వచ్చే వాళ్ళం ).టీవీ లో దూరదర్శన్ వస్తే సూపర్ !


 ఆఫీసు కి వెళ్ళిన అమ్మ నాన్న ల  కోసం పిల్లల ఎదురు చూపులు , మొగుడు ఆఫీసు కి వెళ్లి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా..  అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసే భార్యామణులు, స్కూల్ కి వెళ్ళిన పిల్లలు ఎప్పుడు తిరిగివస్తారా అని తల్లడిల్లే తల్లి మనసు .... ఇంట్లో ఎవరన్న బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు ఎదురుచూపులు ఉండేవి ఎందుకంటే ప్రతి సెకండ్ కి update ఇవ్వడానికి మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి  వచ్చే వరకు ఆత్రం ఉండేది ... కాదంటారా ? ఆఫీసు ల నుంచి స్కూల్ ల నుంచి వచ్చాక పిల్లలు పెద్దల కి బోల్డంత టైం. అప్పుడు  మనుషులకి మనుషులే వ్యాపకం. ఇప్పుడు మాటలు రాని  మెషీన్స్ ఏ  మనకు వ్యాపకం.. how silly ??

మహా అంటే బుధవారం చిత్రహార్,శుక్రవారం చిత్రలహరి ... ప్రతి రోజు రాత్రి 7 pm కి వార్తలు ...( అండ్ ఒకే ఒక్క న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ :)) అంతకు మించి టీవీ చూడాలి అనే అనిపించేది కాదు . సండే రోజు అందరు టీవీ ముందు కూర్చుని రామాయణం ,మహాభారతం చూసుకుంటూ టిఫిన్లు స్టార్ట్ చేస్తే ... జంగల్ బుక్ , మిక్కీ మౌస్ కార్టూన్స్ తో పిల్లల కి కాసేపు కాలక్షేపం. టీవీ కే  అత్తుకు పోవల్సినంత దౌర్భాగ్యం ఉండేది కాదు . మిగితా టైం అంతా ఫ్యామిలీ కే ఉండేది .  

కాని...  ఇప్పుడు బాబోయ్ ..... 24 ఘంటలు టీవీ ని వాయించుడే ..(దానికే కనుక నోరు ఉంటే పాపం మొత్తుకునేది !) పక్క న వాళ్ళతో కూడా మాట్లాడలేనంత బిజీ మనం... కాని "మొగలి రేకుల్లో" ఆర్కే కి ఎమన్నా అయితే అయ్యో పాపం అంటాం ..అదే కాక  ఆర్కే తన కొడుకు ని ఎప్పుడు కలుస్తాడో  అనే టెన్షన్ కూడా  ఎక్కువ మనకి... ( నేను సీరియల్స్ చూడను .. ఏదో ఈ సీరియల్ లో ఆర్కే అనే పేరు ఉందని ఒకటి రెండు సార్లు విన్నాను లెండి :)) సీరియల్ కూడా ఈ మధ్యనే అయ్యి పొయ్యింది అట !" మొగలి రేకులు" అయిపొతే ఏంటి ఇంకో...  "రోజా రేకులు" మొదలవుతుంది ... మంజుల నాయుడు కి కథలు తక్కువా... ;-) హి .. హి :)



ఇక మొగుళ్ళ గురించి డాడీ ల గురించి చెప్పే అవసరమే లేదు.  వాళ్ళకి .. టీవీ 9 , సాక్షి , T న్యూస్ ఉంటే చాలు ... జగన్ మీద , K.C.R , మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంట్లో పెళ్ళాం పిల్లల మీద కూడా ఉండదు ! ఇందంతా ఒక ఎత్తు అయితే కాలేజీ కి వచ్చిన పిల్లలు మన చేతికి తరువాత ... అసలు కళ్ళకి కూడా అందరు.. ! IPL  matches ...  Justin  Beiber, Shakira, Dub Step ల లోకం మునిగి తేలుతూ ...ఉంటారు . ( ఎందుకు ఉండరు ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఉంటే  కదా !) ఒకే ఇంట్లో ఉన్నా ... " ఎవరికీ వారే యమునా తీరే"! .. లాగా ఐపోయాయి బ్రతుకులు .


ఏవండి.. మీ అందరికో ప్రశ్న ... నిజ్జం గా చెప్పండి మీరు ఒక పోస్ట్ మాన్ ని చూసి ఎన్ని రోజులు అయ్యింది ? మీకు ఒక ఉత్తరం వచ్చి ఎన్ని ఏళ్ళు అయ్యింది ?? (ఏదో అమాసకో పున్నానికో  వెడ్డింగ్ కార్డ్స్ తప్ప ! ) ఆహా .. అసలు ఆ "ఉత్తరం " అనే పేరు వింటేనే ఎంత సంతోషంగా ఉండేదో ..


 పోస్ట్ మాన్  మన వీధి లోకి వస్తే చాలు మనకు ఎమన్నా ఉత్తరం ఉందో ..  లేదో ? అని బోల్డంత curiosity. దానికి తోడు ఆయన సైకిల్ నుండి కొట్టే బెల్ ... ఆ సౌండ్ వినగానే  ఇంట్లో ఏ పని లో ఉన్నా ....  ఇంటి ముందుకి వచ్చి వెయిట్ చేసేవాళ్ళం .  ఒక వేళ ఉత్తరం వచ్చిందంటే అది కూడా...  మన పేరు మీద  ... ఇక పండగే పండుగ :) ఎంతో  దూరం నుంచి మన కోసం రాసిన వాళ్ళ గురించి ఇక ఆలోచనలు షురూ ! ఉత్తరం మొత్తం చదివే సరికి నిజం గా వాళ్ళే  మన ముందు ఉన్న ఫీలింగ్. ఉత్తరాల లో ఉన్న పర్సనల్ టచ్ ఇప్పుడు మనం రాసుకునే ఇ మెయిల్ ల  లో ఉందా ?

ఏది ఏమైనా .. ప్రపంచం మారుతుంది .. టెక్నాలజీ ఫుల్లు గా అభివృద్ధి చెందుతుంది .. కాని ఒకప్పుడు ఉన్న ఆప్యాయతలు .. ప్రేమలు ... అభిమానాలు రోజు రోజు కి సన్నగిల్లుతున్నాయి. వీటి వల్లనే కమ్యూనికేషన్ గ్యాప్ . " కమ్యూనికేషన్ విచ్చలవిడి గా  ఉన్న ఈ రోజుల్లో అర్థం చేసుకోవడం కన్నా అపర్ధాలే ఎక్కువ  ఉన్నాయి" ... is this not funny ??? అలా అని మన డెవలప్మెంట్ ని నేను ఏమి తప్పుబట్టడం లేదు .   టెక్నాలజీ తో పాటు మనిషి మనిషి కి మధ్య ఉండే మానవత్వం, ప్రేమ,హ్యూమన్ రిలేషన్స్ ని కూడా ఫైన్ ట్యూన్ చేసి  సానబట్టాలి అంటాను.  అంతా  మన చేతుల్లో నే ఉంది ... ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటమో లేక ఎదిగిన కొద్ది కింద పడటమా .. అనేది ... ఆ దారి ఏంటో? మనకు మనమే కనుక్కోవాలి :) మరి మీ దారి ఏది ?